రజినీ ‘రోబో 2.0’కు ప్రధాని మోడీ కీలక సూచన: అందుకే ఇక్కడ!
దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘2.0’ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రాన్ని భారత్‌లోనే చిత్రీకరించాలని ప్రధాని నరేంద్ర మోడీ సలహా ఇచ్చారట. ఈ విషయాన్ని చిత
చెన్నై: దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన '2.0' చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రాన్ని భారత్‌లోనే చిత్రీకరించాలని ప్రధాని నరేంద్ర మోడీ సలహా ఇచ్చారట. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సీఓఓ రాజు మహాలింగం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం గమనార్హం.
'మా గ్రూప్ అంతా లండన్‌కి చెందినవారే. కానీ ఈ సినిమా మొత్తం భారత్‌లోనే చిత్రీకరించాం. చెప్పాలంటే ఓసారి మోడీగారే రజనీ సార్‌కి సినిమా భారత్‌లో చిత్రీకరించాలని సలహా ఇచ్చారట. సినిమా క్లైమాక్స్‌ని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో చిత్రీకరించాం' అని వివరించారు.

అంతేగాక, మిగతా సినిమా మొత్తం చెన్నైలోని ఈవీపీ ఫిలిం సిటీలో చిత్రీకరించాంమని వెల్లడించారు. సాధారణంగా సినిమాలు 2-డిలో చిత్రీకరించి ఆ తర్వాత త్రీడిలోకి మారుస్తారు, కానీ ఈ సినిమాని మాత్రం పూర్తిగా త్రీడీలోనే చిత్రీకరించామని చెప్పారు.
'క్రౌచింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్' అనే చైనీస్ చిత్రంలా ఇప్పుడు తాము 2.0 తీశామని మహాలింగం వివరించారు. 2.0లో రజనీకి జోడీగా అమీ జాక్సన్ నటించగా, ప్రతినాయకుడిగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించారు. పలువురు హాలీవుడ్ నిపుణులు కూడా ఈ చిత్రం కోసం పనిచేశారు. ఈ చిత్రం దీపావళికి విడుదల కానుంది.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications