రజినీకాంత్ పార్టీ పెట్టాలి, చిరంజీవి ‘ప్రజారాజ్యం’లా మాత్రం కాకూడదు: జయప్రద
సీనియర్ నటి జయప్రద కూడా రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం గురించి స్పందించారు. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆమె కోరారు. అయితే రజినీకాంత్ పెట్టబోయే పార్టీ మరో ప్రజారాజ్యం మాదిరిగా మాత్రం కాకూడదన్నారు.
హైదరాబాద్: తమిళనాడులో సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై చర్చ సాగుతూనే ఉంది. ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ సినీరంగానికి సంబంధించిన హీరోలు, హీరోయిన్లు ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తూనే ఉన్నారు.
తాజాగా సీనియర్ నటి జయప్రద కూడా రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం గురించి స్పందించారు. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆమె కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సిన సమయం వచ్చిందని జయప్రద అభిప్రాయపడ్డారు.

అయితే రజినీకాంత్ పరిస్థితి మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పరిస్థితిలా కాకూడదని ఆమె పేర్కొన్నారు. ఒకవేళ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి అడుగుపెడితే మాత్రం మెగాస్టార్ చిరంజీవిలా మాత్రం చేయకూడదన్నారు.
రజినీకాంత్ పెట్టబోయే పార్టీ మరో ప్రజారాజ్యం మాదిరిగా కాకూడదని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే చిరంజీవిలా వెనకడుగు వేయకూడదని జయప్రద అభిప్రాయపడ్డారు. అంతేకాదు, రజినీకాంత్ పెట్టబోయే పార్టీ తప్పకుండా విజయవంతం అవుతుందని కూడా ఆమె జోస్యం చెప్పారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications