డియర్ సీఎం, మీ గురించి దేవుడిని ప్రార్థిస్తున్నా: ట్విట్టర్‌లో రజనీకాంత్
చెన్నై: తీవ్రజ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతూ చెన్నై గ్రీమ్స్ రోడ్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకోవాలని సూపర్ స్టార్ రజనీకాంత్ ఆకాంక్షించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "డియర్ సీఎం మీరు త్వరగా ఉపశమనం పొందాలని దేవుడిని ప్రార్థిస్తున్నా" అని అందులో పేర్కొన్నారు.
அன்புள்ள CM அவர்கள் விரைவில் நலமடைய இறைவனை பிராத்திக்கிறேன்
— Rajinikanth (@superstarrajini) September 24, 2016
కాగా, సీఎం జయలలిత శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తీవ్ర జ్వరంతో బాధపడుతుంటే, ఆమెను అపోలో ఆసుపత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. ఇక ఆమె త్వరగా కోలుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు పూజలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం జయలలితను మెరుగైన చికిత్స కోసం సింగపూర్‌కు తరలిస్తున్నారు.
ఆమెకు మధుమేహం ఎక్కువ స్థాయిలో ఉండటం, దానికి తోడు కిడ్నీ సంబంధిత సమస్య కూడా ఉండటంతో చికిత్స కోసం ఆమెను సింగపూర్ పంపుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆమెకు జ్వరం తగ్గింది గానీ కోలుకులేదని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వైద్యులు తెలిపారు.

బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కూడా జయలలితను మెరుగైన వైద్యం కోసం సింగపూర్ ఆసుపత్రికి తరలించాలని ట్విట్టర్‌లో సూచించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జ్వరం తగ్గడంతో ఆమెకు సాధారణ ఆహారాన్నే ఇస్తున్నట్లు అపోలో ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ సుబ్బయ్య విశ్వనాథన్ వెల్లడించారు.
ఇక జయలలిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమెకు బొకే పంపారు. అందుకు ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ ఓ లేఖ రాశారు. సీఎం అనారోగ్యంతో ఆస్పత్రి పాలు కావడం ఆందోళనకరంగా ఉందని, ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తమిళనాడు ఇన్‌చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు.
🙏🏻 wishing you a speedy recovery respected CM madam https://t.co/9WuNuVDrlP
— soundarya rajnikanth (@soundaryaarajni) September 24, 2016
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications