పాకిస్థాన్ కు చుక్కలే.. రంగంలోకి INS హిమగిరి, ఉదయగిరి యుద్ధ నౌకలు..
భారత నౌకా సంపత్తిలో మరో రెండు యుద్ధ నౌకలు చేరాయి. ప్రాజెక్ట్ 17- ఏలో భాగంగా ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్‌ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకలను రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ లాంఛనంగా ప్రవేశపెట్టారు. వీటిని పూర్తి స్థాయిలో దేశీయ సాంకేతికతతో రూపొందించారు. బ్రహ్మోస్ క్షిపణులను మోసుకెళ్లడమే కాకుండా అత్యున్నత స్థాయి ఆయుధాలను గుర్తించే సెన్సార్లు ఉండటం ఈ నౌక ప్రత్యేకతగా అధికారులు వెల్లడించారు. ఈ యుద్ధ నౌకలు భారత నేవీ రంగాన్ని మరింత శక్తివంతంగా మారుస్తాయని అధికారులు తెలిపారు. ఈ విజయాన్ని ఆత్మనిర్భర భారత్ లో మరో అడుగుగా రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కొనియాడారు.
భారత నౌకాదళ సంపత్తిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భారత నౌకాదళంలోకి తాజాగా మరో రెండు యుద్ధనౌకలు చేరాయి. ప్రాజెక్ట్ 17- ఏ లో భాగంగా ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్‌ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకలను రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ లాంఛనంగా ప్రవేశపెట్టారు. యాంటీ సబ్మెరైన్ వార్ ఫేర్ టెక్నాలజీ, బ్రహ్మోస్ క్షిపణులను మోసుకెళ్లడమే కాకుండా అత్యున్నత స్థాయి ఆయుధాలను గుర్తించే సెన్సార్లు ఉండటం ఈ నౌకల ప్రత్యేకతగా అధికారులు వెల్లడించారు.

ఈ రెండు యుద్ధనౌకలు ప్రాజెక్ట్-17 ఏ లో భాగంగా పూర్తిస్థాయి స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకున్నాయి. మల్టీ-మిషన్ స్టెల్త్ ఫ్రిగేట్ టెక్నాలజీతో తయారు చేశారు. విశాఖపట్టణం వేదికగా ఈ యుద్ధ నౌకలను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ త్రిపాఠీ జాతికి అంకితం చేశారు. ఈ విజయాన్ని ఆత్మనిర్భర భారత్ లో మరో అడుగుగా రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కొనియాడారు. ఐఎన్‌ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకను ముంబైలోని మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) సంస్థ తయారు చేసింది. అలాగే ఐఎన్‌ఎస్ హిమగిరి యుద్ధ నౌకను కోల్ కతా లోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్-ఇంజనీర్స్ (జీఆర్‌ఎస్‌ఈ) సంస్థ నిర్మించింది.
भारतीय नौसेना में अत्याधुनिक प्रोजेक्ट 17ए स्टील्थ फ्रिगेट उदयगिरि और हिमगिरि कमीशन हुए
— News24 (@news24tvchannel) August 26, 2025
◆ स्वदेशी तकनीक, ब्रह्मोस मिसाइल और उन्नत सेंसर से लैस ये युद्धपोत समुद्री अभियानों में भारत की ताकत बढ़ाएंगे
◆ रक्षा मंत्री राजनाथ सिंह ने इसे आत्मनिर्भर भारत और नौसेना की युद्धक क्षमता… pic.twitter.com/9MrJ64dAmy
ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్‌ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకల్లో ఆధునిక డీజిల్ లేదా గ్యాస్ కంబైన్డ్ ప్రొపల్షన్ ప్లాంట్లు, అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ప్లాట్ ఫామ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ తోపాటు పూర్తిస్థాయి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఆయుధాలు, సెన్సార్ల సూట్లను సమకూర్చారు. 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో ఈ యుద్ధ నౌకలను నిర్మించినట్లు అధికారులు తెలిపారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications