నువ్వు సెలబ్రిటీ అయినా డోంట్ కేర్ -జయాబచ్చన్ పై రాజ్యసభ ఛైర్మన్ అనుచిత వ్యాఖ్యలు..!
రాజ్యసభలో ఇవాళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నిరసన తెలిపేందుకు సీటులో నుంచి లేచిన సమాజ్ వాదీ పార్టీ మహిళా ఎంపీ జయాబచ్చన్ పై రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్ కర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు ఆమెను తిరిగి మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు. రాజ్యసభ ఛైర్మన్ వైఖరితో వివాదాలకు దూరంగా సౌమ్యంగా ఉండే జయాబచ్చన్ తీవ్రంగా నొచ్చుకున్నారు. అంతే కాదు ఆయన సారీ చెప్పాల్సిందేనని పార్లమెంట్ బయట డిమాండ్ చేశారు.
ఇవాళ రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడేందుకు లేవగా అధికార పక్ష సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఛైర్మన్ జగ్ దీప్ ధన్ కర్ ఆయన మైక్ కట్ చేశారు. దీనిపై విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇదే క్రమంలో ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ మాట్లాడేందుకు ప్రయత్నించగా.. బీజేపీ సభ్యులు ఆమెను హేళన చేశారు. దీనిపై స్పందించిన ఆమె తాను కళాకారిణిని అని, తనకు ఇతరుల హావభావాలు అర్దం చేసుకునే అనుభవం ఉందన్నారు. కానీ మీ స్వరం మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.

#WATCH | Amid demand of Opposition Rajya Sabha MPs for expunging remarks of BJP MP Ghanshyam Tiwari about LoP, SP MP Jaya Bachchan made remarks about the tone of the remarks made by the Chairman Jagdeep Dhankhar. The Chairman took strong exception to Jaya Bachchan's remarks,… pic.twitter.com/2qNe82eEws
— ANI (@ANI) August 9, 2024
దీనిపై స్పందించిన రాజ్యసభ ఛైర్మన్ ధన్ కర్.. జయాబచ్చన్ పై ఫైర్ అయ్యారు. మీరు సెలబ్రిటీ అయినా కావచ్చు నాకు అనవసరం అన్నారు. తనకు పాఠాలు చెప్పొద్దన్నారు. మీరు గొప్ప పేరు సంపాదించారని, అయితే నటుడు దర్శకుడికి జవాబుదారీ అనేది తెలుసు కదా అన్నారు. తాను దారితప్పానని అంటారా, నా స్వరం ఆమోదయోగ్యం కాదంటారా అని జయాబచ్చన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై తిరిగి ఆమె మాట్లాడబోతే అవకాశం ఇవ్వలేదు. దీనికి నిరసనగా విపక్షం రాజ్యసభ నుంచి వాకౌట్ చేసింది.
#WATCH | On her exchange of words with Rajya Sabha Chairman Jagdeep Dhankhar, Samajwadi Party MP Jaya Bachchan says, "...I objected to the tone used by the Chair. We are not school children. Some of us are senior citizens. I was upset with the tone and especially when the Leader… pic.twitter.com/rh8F35pHsM
— ANI (@ANI) August 9, 2024
అనంతరం విపక్ష ఎంపీలు సమావేశమై రాజ్యసభ ఛైర్మన్ వ్యవహారశైలిపై చర్చించారు. అనంతరం జయాబచ్చన్ స్పందిస్తూ ధన్ కర్ చైర్మన్ సీటులో కూర్చొన్నప్పుడు ఏదైనా మాట్లాడొచ్చని, కానీ బయట మాత్రం ఆయన మా తోటి ఎంపీ మాత్రమే అన్నారు. ఆయన మాట్లాడిన భాష సరికాదన్నారు. తామేమీ స్కూలు పిల్లలం కాదన్నారు. ఆయన స్వరం తమకు అభ్యంతరకరమే అన్నారు. ఈ మధ్య ధన్ కర్ అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలు కూడా చేస్తున్నారని ఆరోపించారు. ఆయన తనకు క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications