మావోయిస్ట్ ల చెర నుండి రాకేశ్వర్ సింగ్ విడుదల ... ధృవీకరించిన ఛత్తీస్‌గఢ్ ఐజీ
ఏప్రిల్ 2వ తేదీన ఛత్తీస్గఢ్ లోని సుక్మా బీజాపూర్ ప్రాంతంలో మావోయిస్టుల మెరుపుదాడి సమయంలో మావోయిస్టు ఎత్తుకెళ్లిన కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ కు మావోయిస్టులు చెర నుండి విముక్తి లభించింది. ఐదు రోజులుగా రాకేశ్వర సింగ్ విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన అందరిలో వ్యక్తమైంది.

రాకేశ్వర్ సింగ్ విడుదల కోసం కుటుంబంతో పాటు పలువురు విజ్ఞప్తి
రాకేశ్వర్ సింగ్ ను విడుదల చేయాలంటూ అతని కుటుంబ సభ్యులతో పాటుగా, పలువురు మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. రాకేశ్వర్ సింగ్ కుమార్తె తన తండ్రిని విడుదల చేయాలని నక్సల్స్ అంకుల్స్ అంటూ దీనంగా ఏడుస్తూ విజ్ఞప్తి చేసింది. ఇక వీడియో వైరల్ గా మారింది. అంతేకాదు ప్రొఫెసర్, మానవ హక్కుల కార్యకర్త జి హరగోపాల్ నేతృత్వంలోని తెలంగాణలో జరిగిన ఫోరమ్ ఎగైనెస్ట్ రిప్రెషన్ మావోయిస్టులు బందీగా ఉంచిన కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్‌ను వదిలిపెట్టాలని విజ్ఞప్తి చేసింది.

మధ్యవర్తిని పంపాలన్న మావోలు .. తమకు పోలీసులు శత్రువులు కాదని లేఖ
దీంతో తమకు పోలీసులు శత్రువులు కాదంటూ, తమపై దాడి చేసేందుకు వచ్చిన క్రమంలోనే అతన్ని పట్టుకున్నామంటూ మధ్యవర్తిని పంపిస్తే విడుదల చేస్తామంటూ మావోయిస్టులు లేఖ రాశారు. జవాన్ రాకేశ్వర సింగ్ క్షేమంగా ఉన్నాడని అతని ఫోటో ను సైతం విడుదల చేశారు. అయితే అది పాత ఫోటో అని, రాకేశ్వర్ క్షేమం పై ఆందోళన వ్యక్తం చేస్తూ రహదారిపై బైఠాయించారు రాకేశ్వర్ కుటుంబ సభ్యులు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అసహనం వ్యక్తం చేశారు .

రాకేశ్వర్ సింగ్ ను విడుదల చేసిన మావోలు .. ధృవీకరించిన చత్తీస్ గడ్ ఐజీ
ఎట్టకేలకు నేడు ప్రభుత్వం అధికారికంగా ఏ మధ్యవర్తిని నియమించనప్పటికీ, రాకేశ్వర్ విడుదల కోసం విజ్ఞప్తి చేసే ప్రయత్నంలో గిరిజన కార్యకర్త సోని సోరి బీజాపూర్ ప్రాంతానికి వెళ్ళారు . ఐదు రోజులుగా మావోయిస్టుల చెరలో ఉన్న రాకేశ్వర్ సింగ్ ను ఎట్టకేలకు విడుదల చేసినట్టు చత్తీస్గడ్ ఐజి ధ్రువీకరించారు. టెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు వదిలి వేశారని, కాసేపట్లో జవాన్ రాకేశ్వర్ సింగ్ బెటాలియన్ కు చేరుకుంటారని తెలుస్తుంది.

ఏప్రిల్ 2 న ఛత్తీస్ గడ్ లోని సుక్మా-బీజాపూర్ ప్రాంతంలో మావోల బందీగా రాకేశ్వర్ సింగ్
210 వ కోబ్రా బెటాలియన్‌తో కమాండో అయిన రాకేశ్వర్‌ను ఏప్రిల్ 2 న ఛత్తీస్ గడ్ లోని సుక్మా-బీజాపూర్ ప్రాంతంలో ఘోరమైన ఆకస్మిక దాడిలో మావోయిస్టులు పట్టుకున్నారు. అప్పటి నుండి ఆయన జాడ కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. అలాగే మావోల ఏరివేతకు కేంద్రం రంగం సిద్ధం చేసింది . మావోలు చేసిన అతి పెద్ద మెరుపు దాడిలో 24 మంది జవాన్లు మరణించటం కేంద్రం జీర్ణించుకోలేకపోతుంది . ఏది ఏమైనా మావోయిస్ట్ ల చెరలో ఉన్న రాకేశ్వర్ సింగ్ విడుదలతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు . దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మావోయిస్ట్ ల చెర నుండి రాకేశ్వర్ సింగ్ విడుదల ... ధృవీకరించిన ఛత్తీస్‌గఢ్ ఐజీ#RakeshwarSinghManhas #Police #moist pic.twitter.com/Jf0NF4sOv2
— oneindiatelugu (@oneindiatelugu) April 8, 2021
మావోయిస్ట్ ల చెర నుండి రాకేశ్వర్ సింగ్ విడుదల ...#Released #Abducted #centralgovernment #RakeshwarSinghManhas pic.twitter.com/jJiTUUmiBL
— oneindiatelugu (@oneindiatelugu) April 8, 2021
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications