Ram Dev: బ్రిజ్ భూషణ్‍ను అరెస్ట్ చేయాలి.. రెజ్లర్లకు మద్దతుగా నిలిచిన రామ్ దేవ్ బాబా..
మైనర్‌తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ మరియు బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని యోగా గురువు రామ్ దేవ్ బాబా డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ వద్ద కొన్ని వారాలుగా నిరసన చేస్తున్న భారత అగ్రశ్రేణి రెజ్లర్లకు యోగా గురువు రామ్‌దేవ్ మద్దతు తెలిపారు. "దేశంలోని రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద కూర్చుని రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిపై లైంగిక ఆరోపణలు చేయడం చాలా సిగ్గుచేటు. అలాంటి వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపాలి. రోజూ వారికి తల్లుల గురించి అవాకులు చెవాకులు పేలుతున్నారు. సోదరీమణులు, కుమార్తెలు. ఇది చాలా ఖండించదగిన దుష్ట చర్య" అని రామ్‌దేవ్ అన్నారు.
ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత కూడా సింగ్‌ను అరెస్టు చేయకపోవడం భాదకరమన్నారు. రామ్ దేవ్ రాజస్థాన్‌లోని భిల్వారాలో మూడు రోజుల యోగా శివిర్‌లో పాల్గొన్నారు. "నేను స్టేట్‌మెంట్ మాత్రమే ఇవ్వగలను. అతన్ని జైలులో వేయలేమన్నారు. "నేను రాజకీయంగా అన్ని ప్రశ్నలకు సమాధానమివ్వగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాను. నేను మానసికంగా లేదా మేధో వికలాంగుడిని కాదు, నాకు దేశం పట్ల విజన్ ఉంది" అని రామ్‌దేవ్ అన్నారు.

రెజ్లర్లకు మద్దతుగా సినీ నటుడు కమల్ హాసన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. "ఈరోజు రెజ్లింగ్ సోదరుల అథ్లెట్ల నిరసనలకు నెల పూర్తయింది. జాతీయ కీర్తి కోసం పోరాడే బదులు, వ్యక్తిగత భద్రత కోసం పోరాటం చేయడం బాధకరం. తోటి భారతీయులు, మన దృష్టికి అర్హులు, మన జాతీయ క్రీడా చిహ్నాలు లేదా విస్తృతమైన నేర చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడా? #IStandWithMyChampions #WretlersProtest" అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు.
-
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు












Click it and Unblock the Notifications