Ramadan 2022: కఠోర ఉపవాసాలు, పవిత్ర మనసుతో నిర్వహణ.. జకాత్ కంపల్సరీ
ముస్లింల పవిత్ర పండగ రాబోతుంది. రంజాన్ వచ్చేనెల 2వ తేదీన ప్రారంభం అయ్యే అవకాశం. అలా నెలరోజుల పాటు కొనసాగుతుంది. మాసంలో ముస్లింలు ఉపవాసాలు చేస్తూ ప్రార్థనలు చేస్తుంటారు. ఇస్లాం నమ్మకం ప్రకారం ఈ నెలలో నరకం గేట్లు మూసివేయబడి, స్వర్గం గేట్లు తెరుచుకునే ఉంటాయట.. ఈ నెల రోజుల్లో పేదలకు సాయం చేయాలని చెబుతుంటారు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ అల్లాకి ప్రార్థనలు చేస్తూ కఠిన ఉపవాస దీక్షలతో రంజాన్ నెల జరుపుకుంటారు. రంజాన్ పండుగ మానవాళికి హితాన్ని అందిస్తుంది. ముస్లింలు చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల రంజాన్ పండుగ జరుపుకుంటారు.

కఠినంగా ఉపవాసం..
ముస్లింలు చంద్ర మానాన్ని అనుసరించి పండుగ జరుపుకోవడానికి గల కారణం ఆ మాసంలో ముస్లింల పవిత్ర గ్రంధమైన ఖురాన్ ఆవిష్కరించబడింది. ఈ నెలలో రంజాన్ పండుగకు ప్రాముఖ్యం ఏర్పడింది. ఖురాన్‌లో రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ఉపవాస వ్రతం అని చెబుతోంది. ముస్లింలు అంతా నెల మొత్తం కఠినమైన ఉపవాసము చేస్తారు. ముస్లింలు ఉపవాస సమయంలో ఎలాంటి పరిస్థితులలో కూడా చెడు మాటలు పలక కూడదు. చెడు మాటలను వినకూడదు.
ఉపవాసం చేసేవారు వారి దృష్టి మొత్తం ఆ భగవంతుడు పై ఉంచాల్సి ఉంటుంది. ఎలాంటి పరిస్థితులలో కూడా తమ దృష్టిని చెడు వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

చెడు భావన ఉండొద్దు
ఉపవాసం చేసేవారు తన శరీర భాగాలను చెడు పనుల నుంచి దూరంగా ఉంచుకోవాలి. అలాగే అక్రమంగా సంపాదించి ఆ డబ్బుతో ఇఫ్తార్ విందు ఇవ్వకూడదనే కఠిన నియమం ఉంది. అబద్దాలు చెప్పడం, చాడీలు చెప్పడం,అనవసర కబుర్లతో కాలయాపన, నోటిదురుసు లాంటివీ ఉపవాస స్ఫూర్తికి విరుద్ధం అని ఖురాన్‌లో రాసి ఉంది. పరోక్ష నింద వల్ల ఉపవాసం భంగం అవుతుందట. ఉపవాసం చేసేవారు.. చేసే ఉపవాసానికి ఫలితం అందుతుందో లేదో అనే ఆందోళన ఉండటం వల్ల రోజు ఉపవాస వ్రతాన్ని చక్కగా నిర్వర్తించేలా చేస్తాయట. ఉదయం సూర్యోదయం కన్నా ముందే ఏదైనా తినాలి.. ఆ తర్వాత సూర్యుడు ఉన్న సమయంలో నోటిలో వచ్చే ఉము కూడా మింగకూడదు. అంతా పవిత్రంగా ఉండటంతో అల్లా తమను కరుణిస్తాడని వారు భావిస్తారు.

జకాత్ చెల్లించాలి
జకాత్ అంటే పవిత్రత, రంజాన్ మాసంలో ఉపవాసలతోపాటు జకాత్ చెల్లించడం తప్పనిసరి. ధనికుడు పవిత్రుడు అయ్యేందుకు ఏడాదికి ఒకసారి అతని సంపద నుంచి రెండున్నర శాతం చొప్పున పేదలకు దానంగా అందించాలి. ధనం, బంగారం, వస్తువులు ఇవ్వడాన్ని 'జకాత్' అంటారు. ధనంలో నూటికి రెండున్నర రూపాయల చొప్పున 'జకాత్' ప్రతి సంవత్సరం చెల్లించాలి. అలా చేస్తే పుణ్యం వస్తోందని.. పేదలకు సాయం చేయాలని ఖురాన్‌లో రాసి ఉంది.












Click it and Unblock the Notifications