టెక్కీ స్వాతి హత్య కేసు: రామ్‌కుమార్‌కి జ్యుడీషియల్ కస్టడీ
చెన్నై: ఇటీవల నుంగంబాక్కం రైల్వే స్టేషనులో జరిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్‌కుమార్‌కు కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
ఈ కేసులో నిందితుడిని పోలీసులు తిరునెల్వేలిలో పట్టుకున్నారు. పోలీసులకు దొరకగానే రామ్‌కుమార్ గొంతు కోసుకోవడంతో పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు.

రామ్‌కుమార్‌ను సోమవారం తిరునెల్వేలి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో మెడికల్ బృందం, పోలీస్ ఎస్కార్ట్‌తో కోర్టుకు తీసుకెళ్లారు. న్యాయమూర్తి అతడికి 15రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు పోలీసులు వెల్లడించారు. జూన్ 24న స్వాతి హత్య జరగగా.. జులై 1న నిందితుడిని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications