'కాంతార' వివాదం.. నటుడు రణ్ వీర్ సింగ్ పై FIR నమోదు
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ఇటీవల ధురంధర్ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 1200 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ మూవీ జనవరి 30న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే రణ్ వీర్ సింగ్ పై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదైంది. కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ 'కాంతార'లోని పవిత్రమైన దైవ కోల సన్నివేశాన్ని రణ్ వీర్ సింగ్ స్టేజీపై ఎగతాళి చేస్తూ ఇమిటేట్ చేశాడని, దాంతో హిందువుల మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణల నేపథ్యంలో బెంగళూరులోని ది హై గ్రౌండ్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా అతడిపై బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ కాంతార లోని పవిత్రమైన సీన్లను రణ్ వీర్ సింగ్ ఎగతాళి చేశాడని ఆరోపణలు వచ్చాయి. అయితే బెంగళూరుకు చెందిన న్యాయవాది ప్రశాంత్ మేతల్.. రణ్ వీర్ సింగ్ చర్యలు కోట్లాది మంది హిందువుల, ముఖ్యంగా కర్ణాటకలోని తుళు మాట్లాడే ప్రజల సెంటిమెంట్లను గాయపరిచాయని కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన బెంగళూరులోని మేజిస్ట్రేట్ కోర్టు, పోలీసులకు కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు బెంగళూరులోని ది హై గ్రౌండ్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

గతేడాది నవంబర్ 28న గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకల్లో రణ్వీర్ సింగ్ పాల్గొన్నారు. అయితే వేదికపై కాంతార సినిమా, రిషబ్ శెట్టి నటనను ప్రశంసించే నేపథ్యంలో రణ్ వీర్ సింగ్ కాంతార చిత్రంలోని దైవకోల సన్నివేశాన్ని ఇమిటేట్ చేశారు. దీంతో తుళు సంస్కృతిని అనుసరించే భక్తులు, హిందూ సంఘాలు రణ్ వీర్ సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే రణ్ వీర్ సింగ్ పై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదైంది.
-
"మేము VIPs.. ప్రతి ఎమ్మెల్యేకు 5 ఐపీఎల్ టికెట్స్.. సెపరేట్ సీటింగ్" -
రెహ్మాన్ డకైత్ వర్సెస్ మేజర్ ఇక్బాల్.. అసలైన విలన్ ఎవరు? -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
సాయి పల్లవి ఫ్యాన్స్కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications