లైంగిక దాడి ముఠా వెనుక తమిళ హీరో ? అన్నాడీఎంకే నుంచి నాగరాజు సస్పెండ్
చెన్నై : తమిళనాడులో సంచలనం సృష్టించిన లైంగిక దాడుల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ దాడుల వెనుక అన్నాడీఎంకే నేత నాగరాజుతోపాటు తమిళ హీరో ప్రోద్బలం ఉందని తెలుస్తోంది. ఈ కేసు విచారణలో మరిన్ని అంశాలు వెలుగుచూసే అవకాశం ఉంది.

అలా వెలుగులోకి ..
ఇటీవల కొయంబత్తూరులో ఓ కేసు విచారణ చేపట్టారు స్థానిక పోలీసులు. ఆ కేసు ఎంక్వైరీ సాగుతుండగానే లైంగిక దాడి అంశం వెలుగులోకి వచ్చింది. పొలాచ్చి కేంద్రంగా దాదాపు 200 మంది విద్యార్థునులపై లైంగిక దాడి జరిగినట్టు తేలింది. ఈ ముఠా వెనుక అన్నాడీఎంకే నేత నాగరాజు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. దీంతో ఆత్మరక్షణలో పడ్డ అధికార పార్టీ .. నాగరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

బెదిరింపులతో బహిర్గతం
పొల్లాచ్చిలో విద్యార్థునులపై లైంగికదాడి చేసి పైశాచిక ఆనందం పొందారు నాగరాజు అండ్ కో. ఈ విషయం బాధితురాలి కుటుంబానికి తెలియడంతో .. వారు ఎక్కడ కేసు పెడతారోనని ఆందోళన చెందాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని వారిని బెదిరించాడు. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో నాగరాజు బృందం చేసిన అరాచకాల పర్వం వెలుగులోకి వచ్చాయి.

సోషల్ మీడియే వేదిక
విద్యార్థునులతో సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకొని వలవేశారు. ఆ తర్వాత మత్తు మందుకు అలవాటు చేశారు. మత్తు ఇచ్చి లైంగికదాడికి పాల్పడ్డారు. సామూహిక అత్యాచారాలు చేసి .. పైశాచిక ఆనందం పొందడమే గాక వీడియోలు తీశారు. వాటిని చూపించి వారిని బ్లాక్ మెయిల్ చేశారు.

తమిళ హీరో పాత్ర ?
లైంగిక దాడుల వెనుక ఓ తమిళ హీరో హస్తం ఉందని సమాచారం. ఆయనతోపాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారని తెలుస్తోంది. కేసు విచారణలో వారి వివరాలను తమిళనాడు పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications