Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Jimmy Tata: రతన్ టాటాకు సెల్ ఫోన్ కూడా లేని తమ్ముడు ! ఎంత లో ప్రొఫైల్ అంటే..?

భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూశారు. ఎంతో అరుదుగా కనిపించే విలువలతో కూడిన జీవితం గడిపిన ఆయన.. అవే విలువలను తుది శ్వాస విడిచే వరకూ కొనసాగించారు. ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రిలో చేరినా తన కోసం ఎవరూ ఆందోళన చెందవద్దంటూ ట్వీట్ చేశారు. విలాస వంతమైన జీవితం కంటే విలువలతో కూడిన జీవనం కొనసాగించేందుకే ఇష్టపడిన రతన్ టాటాకు మరో అరుదైన వ్యక్తిత్వం కలిగిన సోదరుడు జిమ్మీ టాటా ఉన్నారు.

రతన్ టాటా జీవిత చరిత్ర తెలుసుకోండి..!

రతన్ టాటా తన జీవితాంతం వ్యాపారాలు, ఆవిష్కరణలు, దాతృత్వాలతో గడపగా.. ఆయన సోదరుడు జిమ్మీ మాత్రం అతి సాధారణ జీవితం గడుపుతున్నారు. ముంబైలోని కొలాబాలో ఉన్న ఓ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో నిరాండబర జీవితాన్ని గడుపుతున్నారు జిమ్మీ టాటా. రతన్ టాటాకు స్వయంగా సోదరుడైన జిమ్మీకి వ్యాపారంపై అస్సలు ఆసక్తి లేదు. ఆయన మొబైల్ ఫోన్ కూడా వాడటం లేదంటే నమ్మి తీరాల్సిందే. ఆధునిక సాంకేతికత కంటే పుస్తకాలు, వార్తాపత్రికల ద్వారా సమాచారం తెలుసుకునేందుకు ఆయన ఇష్టపడతారు. అలాగే ఆయన ఇల్లు విడిచి బయటికి కూడా వెళ్లరని చెప్తుంటారు.

ratan tata has a low profile younger brother jimmy-living in 2bhk flat without a mobile phone

జిమ్మీ టాటా పూర్తి పేరు జిమ్మీ నావల్ టాటా. రతన్ టాటాకు స్వయానా తమ్ముడు. టాటా గ్రూప్‌లో ఆయనకూ గణనీయమైన వాటా ఉంది. అయినా కుటుంబ వ్యాపారంపై పెద్దగా ఆసక్తి చూపకుండా తన జీవితమంతా సాధారణ ప్రొఫైల్ తోనే గడుపుతున్నారు. ఆయనకు డబ్బుపై కానీ, విలాసాలపై కానీ పెద్దగా ఆసక్తి లేదు. అయితే ఈ మధ్యే జిమ్మీ తన పుట్టినరోజున రతన్ టాటాతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆయన గురించి సాధారణ జనానికి తెలిసింది.
ఇందులో ఆయన ఓ క్యాప్షన్ కూడా పెట్టారు. "అవి సంతోషకరమైన రోజులు. మా మధ్య ఏమీ రాలేదు. (1945లో నా సోదరుడు జిమ్మీతో),". దీన్ని బట్టి చూస్తే వారి మధ్య ఎలాంటి గ్యాప్ కూడా లేదని అర్దమవుతోంది.

గతంలో ఆర్‌పిజి ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ వర్ధన్ గోయెంకా కూడా జిమ్మీ నిరాడంబర జీవన విధానం గురించి ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ముంబైలోని కోలాబాలోని హాంప్టన్ కోర్ట్‌లోని ఆరవ అంతస్తులో జిమ్మీ ఒక సాధారణ రెండు పడకగదుల అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడని, అతను అద్భుతమైన స్క్వాష్ ప్లేయర్ అని, అతను జీవించి ఉన్నప్పుడు అతని అన్నయ్యకు లేని నైపుణ్యం అని ఆయన తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+