అది బ్రెయినా..? కంప్యూటరా..? మూడేళ్లకే ప్రపంచ రికార్డులు బద్దలు..!
ప్రస్తుతం చిన్నారులు సెల్ ఫోన్ లేనిదే అన్నం కూడా తినడం లేదు. మొబైల్ ఫోన్ లో రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ కు అతుక్కుపోతున్నారు. గంటల తరబడి వాటిని చూస్తున్నారు. దీంతో చిన్నారులు మెదడుకు పని చెప్పడం తగ్గిపోయింది. దీంతో మెదడు సామర్థ్యం క్రమంగా క్షీణిస్తోంది. అయితే ఈ పోటీ ప్రపంచంలో బ్రెయిన్ షార్ప్ గా పనిచేయకపోతే వెనుకబడిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఓ మూడేళ్ల చిన్నారి తన అసాధారణమైన ప్రతిభతో ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతోంది. కేవలం 160 సెకన్లలో హనుమాన్ చాలీసాను పఠించి వరల్డ్ రికార్డు నెలకొల్పింది.
సాధారణంగా మూడేళ్ల పిల్లలు నర్సరీ లేదా ఎల్ కేజీ కు వెళ్తారు. కానీ మధ్యప్రదేశ్ లోని రట్లాంకు చెందిన ఈ చిన్నారి మాత్రం మూడేళ్ల వయసులోనే ప్రపంచ రికార్డులు నమోదు చేస్తోంది. తన అద్భుతమైన జ్ఞాపకశక్తితో మైమరపిస్తోంది చిన్నారి జాన్వీ. కేవలం 2 నిమిషాల 40 సెకన్లలోనే హనుమాన్ చాలీసాను పఠించింది. అదొక్కటే కాకుండా సంస్కృతంలోని అనేక శ్లోకాలను ఒక్కసారి చదివితే చాలు గుర్తుపెట్టుకుని అప్పజెబుతోందీ వండర్ కిడ్. తన అద్భుతమైన ప్రతిభతో ఇప్పటికే లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, వెబ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది జాన్వీ.

సంస్కృతంలోని కష్టమైన శ్లోకాలను, హనుమాన్ చాలీసాను గలగలా పఠిస్తోంది ఈ చిన్నారి. జాన్వీకు 9 నెలల వయసులో మాట్లాడటం నేర్చుకుంటున్న సమయంలో తనలోని ప్రతిభను గుర్తించిన అమ్మమ్మ అప్పటినుంచి ప్రోత్సహిస్తోంది. అలా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ప్రారంభించింది జాన్వీ. కొన్ని రోజుల్లోనే హనుమాన్ చాలీసాను కంఠస్థం చేసుకుంది. తాజాగా లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నిర్వహించిన పరీక్షలో కేవలం 160 సెకన్లలో హనుమాన్ చాలీసాను పఠించి వరల్డ్ రికార్డు నెలకొల్పింది. బాలిక అద్భుతమైన జ్ఞాపకశక్తిని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications