రెబల్ శివసేన ఎమ్మెల్యేల డ్యాన్సులు.. షిండే సీఎం అని తెలియడంతో ఆనందం
శివసేన రెబల్స్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహించిన ఏక్ నాథ్ షిండే సీఎం పదవీ వరించింది. గురువారం రాత్రి 7.30 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే మంత్రి వర్గ విస్తరణ వారంలో ఉంటుందని, బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు శివసేన రెబల్స్‌కు మంత్రి వర్గంలో అవకాశం ఉంటుంది. ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే.

హ్యాపీ..
ఏక్ నాథ్ షిండే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో శివసేన రెబల్ ఎమ్మెల్యేల ఆనందానికి అడ్డులేకుండా పోయింది. గోవాలోని ఓ హోటల్ లో మకాం వేసిన రెబల్ ఎమ్మెల్యేలు సంతోషంగా డ్యాన్స్ వేశారు. కొందరు ఎమ్మెల్యేలు ఏకంగా టేబుళ్లు ఎక్కి డ్యాన్స్ లు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం పర్చారు. శివసేన రెబల్స్ ఎమ్మెల్యేలు 39 మంది ఏక్ నాథ్ షిండే క్యాంపులో ఉన్నారు. బుధవారం వరకు గౌహితిలో ఉన్న వారు గురువారం గోవాలోని ఓ హోటల్ కు మకాం మార్చారు.

స్పెషల్ ప్లైట్
షిండు మాత్రం గురువారం మధ్యాహ్నం గోవా నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి తిరిగి వచ్చారు. నేరుగా ఫడ్నవీస్ ఇంటికి వెళ్లారు. వారిద్దరు కలిసి రాజ్ భవన్ కు వెళ్లి మహారాష్ట్ర గవర్నర్ ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు గురించి ప్రకటించారు. రాత్రి 7.30 గంటలకు షిండే మహారాష్ట్ర 20వ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

వీడియో కాల్
బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి గవర్నర్ ను కలిసిన అనంతరం ఏక్ నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలకు వీడియో కాల్ చేశారు. గోవాలో ఉన్న రెబెల్స్ కు వీడియో కాల్ ద్వారా తాజా పరిణామాలు వివరించారు. రెబెల్ ఎమ్మెల్యేల ముఖాలు వెలిగిపోయాయి. వీడియో కాల్ లో షిండేను చూస్తూ తమ ఆనందం వెలిబుచ్చారు. చేతులు ఊపుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. "ఏక్ నాథ్ షిండే... మీకు ఎదురులేదు... మేమంతా మీ వెంటే ఉంటాం" అంటూ నినాదాలు చేశారు. రెబెల్ ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండేనే మహారాష్ట్ర సీఎం అనే వార్తలను టీవీ తెరపై చూస్తూ డ్యాన్సులు చేశారు.

ప్రమాణం
మహారాష్ట్రలో ప్రభుత్వం కొలువుదీరింది. అనూహ్యంగా సీఎంగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణం చేశారు. అయితే అంతే అనూహ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఏక్‌నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొషియారీ రాజ్ భవన్‌లో వీరిద్దరీతో ప్రమాణం చేయించారు.












Click it and Unblock the Notifications