అమెజాన్ నిర్లక్ష్యం.. ఆర్డర్‌లో పాము ప్రత్యక్ష్యం
ఆన్‌లైన్ షాపింగ్‌లో అనేక తప్పులు జరిగిన ఘటనలు మనం చాలానే చూశాం. ఒకటి ఆర్డర్ పెడితే దానికి బదులుగా మరో వస్తువు డెలివరీ అవుతుంటుంది. ఫోన్లు ఆర్డర్ చేస్తే బిస్కెట్లు, స్టోన్స్ వంటివి పార్శిల్స్‌లో వచ్చిన ఘటనలను ఇప్పటికే అనేకం చూశాం. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని ఓ జంట ఆన్‌లైన్ షాపింగ్‌లో ఎక్స్‌బాక్స్ కంట్రోలర్ కోసం ఆర్డర్ పెడితే ప్రమాదకరమైన పామును అమెజాన్ ఆర్డర్ చేసింది. దీంతో అమెజాన్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కస్టమర్ చేసిన ఆర్డర్‌కు బదులు పామును పంపారు.
అమెజాన్ నిర్లక్ష్యం.. ఆర్డర్‌లో పామును పంపిన యాజమాన్యం...!! pic.twitter.com/SlmlQOpQqm
— oneindiatelugu (@oneindiatelugu) June 19, 2024
బెంగళూరులోని ఒక మహిళ ఎక్స్‌బాక్స్ కంట్రోలర్ కోసం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఆర్డర్ పెట్టారు. అయితే అమెజాన్ ఆర్డర్‌లో జీవించిన ఉన్న కోబ్రాను అమెజాన్ యాజమాన్యం అందించారు.అయితే విషపూరితమైన పాము అదృష్టవశాత్తూ ప్యాకేజింగ్ టేప్‌కు అంటుకోవడంతో ఆమె కుటుంబానికి ఎలాంటి హాని జరగలేదు. ఆర్డర్ ఓపెన్ చేసే ప్రక్రియను వారు వీడియో తీయడంతో దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా అవుతున్నాయి.

ఈ ఘటనపై అమెజాన్ ప్రతినిధి స్పందించారు. దీనిపై అమెజాన్ ప్రతినిధి మాట్లాడుతూ..మా కస్టమర్‌లు, ఉద్యోగులు మరియు సహచరుల భద్రత మాకు అత్యంత ప్రాధాన్యతని, కస్టమర్‌లకు విశ్వసనీయమైన షాపింగ్ అనుభవాన్ని అందించడానికి మేము కష్టపడి పని చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని కస్టమర్‌లకు ఇలాంటి ఘటనలు జరగ్గకుండా జాగ్రత్త వహిస్తామని..వారికి పూర్తి భరోసా కల్పిస్తామని అమెజాన్ ప్రతినిధి హామీ ఇచ్చారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications