Reddy: గాలి బ్రదర్స్, ఎమ్మెల్యే దోషి అని చెప్పిన కోర్టు, కింది కోర్టు తీర్పు సరైనదే, బళ్లారి బాబుకు షాక్ !

బళ్లారి బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి ఓ కేసులో దోషి అని కోర్టు తీర్పు చెప్పింది. బళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డి భార్య మీద పోటీ చేస్తానని చెప్పిన గాలి సోమశేఖర్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయ్యింది.

బెంగళూరు/బళ్లారి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు అతి త్వరలో జరగనున్నాయి. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి జోరుగానే ఉంది. అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ నుంచి బయటకు వచ్చి కొత్త రాజకీయ పార్టీ పెట్టిన గాలి జనార్దన్ రెడ్డి కూడా ఆయన సత్తా చాటుకుని కర్ణాటక రాజకీయాల్లో కింగ్ మేకర్ కావాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు, బళ్లారి సిటీ బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి ఓ కేసులో దోషి అని కోర్టు సంచలన తీర్పు చెప్పింది. బళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డి ఆయన భార్యను పోటీలో దింపినా సరే నేను కచ్చితంగా బీజేపీ నుంచి మా వదిన మీద పోటీ చేస్తానని చెబుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డికి కోర్టు ఆదేశాలతో మైండ్ బ్లాక్ అయ్యింది.

గాలి జనార్దన్ రెడ్డి

గాలి జనార్దన్ రెడ్డి

కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్న పేరు గాలి జనార్దన్ రెడ్డి. మైనింగ్ కింగ్ గా కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పిన గాలి జనార్దన్ రెడ్డి ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి, బీఎస్ యడియూరప్పను సీఎం చెయ్యడంలో కీలకపాత్ర పోషించారు. అయితే అక్రమ మైనింగ్ కేసులో జైలుకు వెళ్లిన గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చి ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయ్యారు. అయితే ఇప్పుడు బీజేపీలో నుంచి బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి కేఆర్ పీ పార్టీ పెట్టి మరోసారి తన సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

అక్రమంగా రివాల్వర్ పెట్టుకున్న రెడ్డి

అక్రమంగా రివాల్వర్ పెట్టుకున్న రెడ్డి

అక్రమంగా రివాల్వర్ పెట్టుకుని తిరిగారని ఆరోపిస్తూ నమోదు అయిన కేసులో కర్ణాటకలోని బళ్లారి సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డిని దోషిగా ప్రకటిస్తూ బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ

ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి వద్ద అనధికారికంగా రివాల్వర్ ఉందని నేరం రుజువు అయ్యిందని ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ప్రత్యేక కోర్టు బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డిని దోషిగా నిర్ధారిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కింది కోర్టును సవాలు చేసిన రెడ్డి

కింది కోర్టును సవాలు చేసిన రెడ్డి

మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును సవాల్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. అయితే బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో అప్పీల్ పిటిషన్ కూడా కొట్టివేసింది. దీని ద్వారా మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును ప్రజాప్రతినిధి న్యాయస్థానం జస్టిస్ జయంత్ కుమార్ సమర్థించారు. మెజిస్ట్రేట్ కోర్టు గాలి సోమశేఖర్ రెడ్డి నిందితుడు అని తేల్చి చెప్పింది.

గాలి రెడ్డి మీద ఎఫ్ఐఆర్

గాలి రెడ్డి మీద ఎఫ్ఐఆర్

గాలి జనార్దన్ రెడ్డి జైలుకు వెళ్లిన తరువాత ఆయన కుటుంబ సభ్యులు, అనుచరలు జీవితాలు కొంచెం తారుమారు అయ్యాయి. పలు కేసులు వీరిని వేధించాయి. 2022, 10వ తేదీన అక్రమ రివాల్వర్ కలిగి ఉన్నారనే ఆరోపణలపై బళ్లారి సిటీ బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డికి మెజిస్ట్రైట్ కోర్టులో శిక్ష పడింది. ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ కింద షరతులతో బెయిల్ మంజూరు చేసిన కోర్టు గాలి సోమశేఖర్ రెడ్డిని విడుదల చేశారు. ప్రజాప్రతినిధిగా మంచి ప్రవర్తనతో ఉన్న మిమ్మల్ని విడుదల చేస్తున్నామని అప్పట్లో కోర్టు చెప్పింది.

రివాల్వర్ లైసెన్స్ ?

రివాల్వర్ లైసెన్స్ ?

కోర్టు బెయిల్ ఇచ్చిన సమయంలో రూ.50, 000 రూ. మొత్తానికి బాండ్ సమర్పించాలని, ఎలాంటి నేర కార్యకలాపాలలో పాల్గొనకూడదని, మీరు ఉంటున్న పరిసర ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలని, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని కోర్టు షరతులు పెట్టింది. ఒక సంవత్సరం పాటు కోర్టు పర్యవేక్షణలోనే ఉండాలని మేజిస్ట్రేట్ కోర్టు గాలి సోమశేఖర్ రెడ్డికి షరతులు విధించింది.

హైదరాబాద్ కు వెళ్లి వస్తుంటే !

హైదరాబాద్ కు వెళ్లి వస్తుంటే !

కింది కోర్టు ఆదేశాలను సవాలు చేసిన గాలి సోమశేఖర్ రెడ్డి తరువాత బెంగుళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. తాను అప్పట్లో ఎక్కువగా హైదరాబాద్ కు తిరుగుతున్నానని, ఆ సమయంలో రివాల్వర్ రెన్యువల్ చెయ్యడం పొరపాటున మరిచిపోయానని, ఇక ముందు అలా జరగదని గాలి సోమశేఖర్ రెడ్డి కోర్టులో చెప్పారు.

ఈ కోర్టులో కూడా అదే తీర్పు

ఈ కోర్టులో కూడా అదే తీర్పు

మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును ఇప్పుడు బెంగళూలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు సమర్థించింది. 2009లో లైసెన్స్ గడువు ముగిసినా రివాల్వర్‌ను ఉంచుకున్న గాలి సోమశేఖర్‌ రెడ్డిపై బళ్లారి బ్రూస్‌పేటలో కేసు నమోదైంది. పోలీసులు సమర్పించిన చార్జిషీట్ ఆధారంగా గాలి సోమశేఖర్ రెడ్డికి ఇప్పుడు కోర్టులో శిక్ష ఖరారు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+