Reddy: ఎమ్మెల్యే సతీష్ రెడ్డి హత్యకు స్కెచ్ వేసి చిక్కిపోయారు. మ్యాటర్ సీరియస్, జంప్ !

బెంగళూరు/చిత్రదుర్గ: సీనియర్ ఎమ్మెల్యే, అధికార పార్టీలో మంచి గుర్తింపు ఉన్న ఎమ్మెల్యే హత్యకు రూ. కోట్లలో డీల్ జరిగిందని ఆడియో లీక్ కావడం కలకలం రేపింది. ఐటీ హబ్ లో ఫేమస్ రౌడీ అయిన రౌడీషీటర్ ఎమ్మెల్యే హత్యకు రెక్కీకూడా నిర్వహించాడని వెలుగు చూడటం కలకలం రేపింది. మ్యాటర్ సీఎం వరకు వెళ్లింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. నేను ఎవరికి భయపడను అంటూ ఎమ్మెల్యే రెడ్డి ధైర్యంగా ఉన్నారు. అయితే ఈ కేసులో కోర్టు జోక్యం చేసుకోవడంతో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి హత్యకు ఎవరెవరు స్కెచ్ వేశారు ? అని పోలీసు అధికారులు మొత్తం మ్యాటర్ మొత్తం బయటకు లాగుతున్నారు.

 సతీష్ రెడ్డి హత్యకు స్కెచ్

సతీష్ రెడ్డి హత్యకు స్కెచ్

బెంగళూరులోని బొమ్మనహళ్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకుడు సతీష్ రెడ్డి హత్యకు స్కెచ్ వేశారని వెలుగు చూడటం కలకలం రేపింది. బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి హత్యకు రూ. 2 కోట్లు డబ్బు ప్రముఖ రౌడీ షీటర్ కు ఇచ్చారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. సతీస్ రెడ్డి హత్యకు కరుడుగట్టిన రౌడీషీటర్, బెంగళూరులోని విల్సన్ గార్డెన్ కు చెందిన విల్సన్ గార్డెన్ నాగా స్కెచ్ వేశాడని ఆరోపణలు రావడంతో బెంగళూరు పోలీసులు సీరియస్ అయ్యారు.

 ఎక్కడికి వెలుతున్నాడు ?

ఎక్కడికి వెలుతున్నాడు ?

విల్సన్ గార్డెన్ నాగ టీమ్ బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డిని హత్య చెయ్యాలని ప్లాన్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే సతీష్‌రెడ్డి రోజు ఎక్కడికి వెలుతున్నారు, ఏం చేస్తున్నారు అని మొత్తం ఆరా తీశారు. విల్సన్ గార్డెన్ నాగా టీమ్ సతీష్ రెడ్డిని హత్య చెయ్యడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. తనను హత్య చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని బోమ్మనహళ్లి బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి పసిగట్టడంతో ఆయన రౌడీషీటర్ల స్కెచ్ నుంచి తప్పించుకున్నారు. హత్యకు పథకం పన్నారని తెలిసిన వెంటనే మేల్కొన్న బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. .

 ఎమ్మెల్యే చేతికి చిక్కిన ఆడియో టేప్

ఎమ్మెల్యే చేతికి చిక్కిన ఆడియో టేప్

బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి హత్య ప్లాన్ చేసిన విల్సన్ గార్డెన్ నాగ గ్యాంగ్ లోని ఆకాష్ చిత్రదుర్గ జిల్లాలో నివాసం ఉంటున్నాడు. ఆకాష్ ఫ్రెండ్ చంద్రూ బెంగళూరులోని బోమ్మనహళ్లిలో నివాసం ఉంటున్నాడు. చంద్రుతో ఫోన్ లో మాట్లాడుతున్న సమయంలో విల్సన్ గార్డెన్ నాగా శిష్యుడు ఆకాస్ సతీష్ రెడ్డి హత్యకు ప్లాన్ చేస్తున్నామని మ్యాటర్ లీక్ చేశాడు. చంద్రూ, ఆకాష్ మాట్లాడుకుంటున్న ఆడియో టేప్ బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి చేతికి చిక్కడంతో స్కెచ్ రివర్స్ అయ్యింది.

 కేసు పెట్టిన ఎమ్మెల్యే పీఏ

కేసు పెట్టిన ఎమ్మెల్యే పీఏ

ప్రజా సేవ చేస్తున్న ఎమ్మెల్యే సతీష్ రెడ్డిని హత్య చెయ్యాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన పీఏ హరీష్ బాబు బెంగళూరులోని బోమ్మనహళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎన్ సీఆర్ తో కోర్టుకు వెళ్లారు, బెంళూరు సీఎంఎం కోర్టు కేసు వివరాలు పరిశీలించి ఎమ్మెల్యే సతీష్ రెడ్డిని హత్య చెయ్యాలని ప్రయత్నిస్తున్న నిందితులను వెంటనే అరెస్టు చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది.

 ఇప్పటికి జస్ట్ ఇద్దరు మాత్రమే

ఇప్పటికి జస్ట్ ఇద్దరు మాత్రమే

బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డిని హత్య చెయ్యడానికి ప్రయత్నిస్తున్న కేసులో కర్ణాటకలోని చిత్రదుర్గా జిల్లాోని హోళేల్కేర్ నివాసి ఆకాష్, గిరీష్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. మిగిలిన నిందితులను అరెస్టు చెయ్యడానికి ఆకాష్, గిరీష్ ను విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డిని హత్య చెయ్యడానికి స్కెచ్ వేసిన విల్సన్ గార్డెన్ నాగాతో పాటు అతని కొంత మంది అనుచరులు బెంగళూరు వదిలిపారిపోయారని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+