వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కనిమొళి ఆగ్రహాం: ఎస్ఎస్‌సీ పరీక్షలో ప్రాంతీయ భాషలకు అన్యాయం

|
Google Oneindia TeluguNews

నీట్ సహా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కాంపిటిటీవ్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్, హిందీలోనే ఉంటాయి. దీంతో ప్రాంతీయ భాషల్లో చదివే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తం చేసింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షను ఇంగ్లీష్ లేదంటే హిందీలో నిర్వహించడాన్ని ఎంపీ కనిమొళి తప్పుపట్టారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.

డిపార్ట్‌మెంట్ పోస్టులకు ఇంగ్లీష్, హిందీ భాషల్లో నిర్వహించడాన్ని కనిమొళి తప్పుపట్టారు. ఇదీ ముమ్మాటికీ భారత సార్వభౌమధికారం ధిక్కరించడమే అవుతుందన్నారు. దీంతో ప్రజాస్వామ్యం హత్యకు గురవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

Regional languages ​​neglected in SSC exams:Kanimozhi

ఇదివరకు ఎస్ఎస్‌సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో 20 వేలకు పైగా గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టులు ఉన్నాయి. వివిధ మంత్రుల శాఖల, కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ 8వ తేదీన పూర్తయిపోయింది.

ఈ పోస్టులకు సంబంధించి ఫస్ట్ స్టేజ్ రాత పరీక్ష టైర్-1 ఉంటుంది. రెండో స్టేజ్ రాత పరీక్ష టైర్ 2 ఉంటుంది. ఆ రెండు పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది జాబితాను తయారు చేస్తారు. అయితే ఈ రెండు పరీక్షలను ఇంగ్లీష్/ హిందీలో నిర్వహిస్తారు. దీంతో ప్రాంతీయ భాషల్లో చదివే అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. 22 భాషల్లో చదివే విద్యార్థులు నష్టపోతున్నారని కనిమొళి అంటున్నారు.

ఇదివరకు క్లరికల్ పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్‌ 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించేవారు. బ్యాంక్ జాబ్స్ కూడా అలానే కండక్ట్ చేసేవారు.. ఇంగ్లీష్, హిందీతోపాటు నిర్వహించేవారు.

English summary
central government’s announcement that the CGL Examination 2022 conducted by the Staff Selection Commission will be conducted in English and Hindi highly condemnable Kanimozhi said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X