ఆటోమొబైల్ సెక్టార్‌కు బూస్ట్.. ట్యాక్స్ తగ్గించే యోచనలో జీఎస్టీ కౌన్సిల్...
న్యూఢిల్లీ : ఆర్థికమాంద్యంతో ఆటోమొబైల్ సెక్టార్ కుదెలైన సంగతి తెలిసిందే. దీంతో గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ) దిద్దుబాటు చర్యలకు దిగింది. ఆయా ఉత్పత్తులపై ఉన్న పన్ను తగ్గిస్తామని భరోసానిస్తోంది. ఈ మేరకు వివిధ ఉత్పత్తులకు సంబంధించి పన్నుపై జీఎస్టీ కౌన్సిల్ శుక్రవారం చర్చించనుంది. ఇందులో ప్రధానంగా కార్లు, హోటళ్ల జీఎస్టీ తగ్గించే అవకాశం కనిపిస్తోంది.
ముఖ్యంగా కార్లపై పన్ను, బిస్కట్లు, ఇతర డిమాండ్ ఉన్న ఉత్పత్తులపై పన్ను తగ్గించే అవకాశం ఉంది. మరికొద్దిరోజుల్లో దసరా, తర్వాత దీపావళి పండుగ ఉన్న నేపథ్యంలో పన్ను తగ్గించి క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు జీఎస్టీ కౌన్సిల్‌లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

దీంతోపాటు హోటళ్లకు విధించే పన్ను, సిమెంట్ పరిశ్రమకు సంబంధించి ట్యాక్స్, వస్త్ర ఉత్పత్తులకు సంబంధించి వేసిన పన్నును కూడా తగ్గించే ఛాన్స్ ఉంది. ఆయా రాష్ట్రాలు పొగాకు వంటి ఉత్తత్తులపై వేసే ట్యాక్స్ పెంచి .. తగ్గించిన పన్నులను సరిదిద్దాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచంలో చాలా రంగాలు ఆర్థికమాంద్యాన్ని ఎదుర్కొంటున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. అదీ ఇప్పట్లో తగ్గించడం అసాధ్యమని చెప్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications