Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Religious: నలుగురు ఆత్మహత్య కేసులో ట్విస్ట్, మతం మారితే వేరే పెళ్లి చేస్తా, భార్య దెబ్బకు అందరూ బలి !

బెంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. దంపతులు అన్యోన్యంగా ఉన్నారని వారి కుటుంబ సభ్యులు బందువులు అనుకున్నారు. దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి కొంత కాలం క్రితమే సిటీకి చేరుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. అపార్ట్ మెంట్ లో అద్దె ఇల్లు తీసుకుని దంపతులు కాపురం పెట్టారు. ఒకే ఇంటిలోని నలుగురు కుటుంబ సభ్యులు మరుసటి రోజు శవాలై కనిపించడం కలకలం రేపింది. అయితే ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్న కేసులో ఎవ్వరూ ఊహించని విషయం బయటపడింది. కుటుంబ సభ్యులు అందరిని మతం మార్చడానికి ఓ మహిళ ప్రయత్నించదని వెలుగు చూసింది. నీ భర్తకు నువ్వు విడాకులు ఇచ్చే, మా మతం వ్యక్తితో నీకు పెళ్లి చేస్తాను, నువ్వు ఇంకా సంతోషంగా ఉండటానికి నేను చాన్స్ ఇస్తానని పక్కటి మహిళ నూరిపోసింది. పక్కింటి మహిళ మాయమాటలు విన్న భార్య ఆమె భర్తకు విడాకులు ఇవ్వడానికి కోర్టు వరకు వెళ్లింది. ఈ విషయం జీర్ణించుకోలేని భర్త అతని భార్యతో పాటు ఇద్దరు బిడ్డలను చంపేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడని సిటీ పోలీసు కమీషనర్ మీడియాకు చెప్పారు.

 హ్యాపీలైఫ్

హ్యాపీలైఫ్

కర్ణాటకలోని బాగల్ కోటే జిల్లాలోని బిళగి తాలుకా సునగ ప్రాంతంలో నాగేష్ (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం విజయలక్ష్మి (29) అనే యువతిని నాగేష్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న నాగేష్ ,విజయలక్ష్మి దంపతులు సంతోషంగా కాపురం చేశారు. నాగేష్, విజయలక్ష్మి దంపతులకు స్వప్నా (8) అనే కూతురు, సమర్థ్ (4) అనే కుమారుడు ఉన్నారు.

మంగళూరులోని అపార్ట్ మెంట్ లో ?

మంగళూరులోని అపార్ట్ మెంట్ లో ?

ఇంతకాలం బాగల్ కోటేలోనే నాగేష్ , విజయలక్ష్మి దంపతులు వారి పిల్లలతో కలిసి నివాసం ఉండేవారు. కొంతకాలం క్రితం మంగళూరు చేరుకున్న నాగేష్, విజయలక్ష్మి దంపతులు మార్గన్స్ స్ట్రీట్ లో ఓ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. నాగేష్ వాటర్ ట్యాంక్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మంగళూరులోనే విజయలక్ష్మి లేడీ సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగంలో చేరింది. మంగళవారం రాత్రి దంపతులు గొడవ పడుతున్న విషయం పక్క అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వారు గమనించారని సమాచారం.

అందరూ శవాలై కనిపించారు

అందరూ శవాలై కనిపించారు

మరుసటి రోజు ఉదయం విజయలక్ష్మి, కూతురు స్వప్నా, కొడుకు సమర్థ్ ఇంట్లో శవమై కనిపించారు. అదే ఇంట్లో నాగేష్ కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భార్య, ఇద్దరు పిల్లలకు విషయం పెట్టి హత్య చేసిన నాగేష్ తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసు అధికారులు అంటున్నారు. ఒకే కుటుంబంలోని నలుగురు ఒకేసారి శవాలై కనిపించడం మంగళూరులో కలకలం రేపింది.

భర్త డెత్ నోట్ లో అసలు మ్యాటర్

భర్త డెత్ నోట్ లో అసలు మ్యాటర్

భార్య విజయలక్ష్మి, ఇద్దరు బిడ్డలను హత్య చేసి ఆత్మహత్య చేసుకునే ముందు నాగేష్ డెత్ నోట్ రాసి పెట్టాడు. ఆ డెత్ లో మా ఆత్మహత్యలకు ఇదే అపార్ట్ మెంట్ లో వేరే ఫ్లాట్ లో నివాసం ఉంటున్న నూర్ జహాన్ కారణం అని నాగేష్ డెత్ నోట్ లో రాసి పెట్టాడని మంగళూరు ఎస్పీ శశికుమార్ మీడియాకు చెప్పారు.

 మతం మార్చుకోవాలని నూర్ జహాన్ ఒత్తిడి

మతం మార్చుకోవాలని నూర్ జహాన్ ఒత్తిడి

నాగేష్ కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్న కేసులో ఎవ్వరూ ఊహించని విషయం బయటపడింది. కుటుంబ సభ్యులు అందరిని మతం మార్చడానికి అదే అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న నూర్ జహాన్ అనేఓ మహిళ ప్రయత్నించదని వెలుగు చూసిందని మంగళూరు పోలీసు కమీషనర్ శశికుమార్ అన్నారు. పోలీసుల విచారణలో నూర్ జహాన్ ఈ విషయం అంగీకరించిందని పోలీసు కమీషనర్ శశికుమార్ మీడియాకు చెప్పారు.

వేరే పెళ్లి చేస్తానని భార్యకు మాయమాటలు చెప్పింది

వేరే పెళ్లి చేస్తానని భార్యకు మాయమాటలు చెప్పింది

నీ భర్త నాగేష్ కు నువ్వు విడాకులు ఇచ్చే, మా మతం వ్యక్తితో నీకు పెళ్లి చేస్తాను, నువ్వు ఇంకా సంతోషంగా ఉండటానికి నేను చాన్స్ ఇస్తానని నూర్ జహాన్ పక్కటి మహిళ విజయలక్ష్మికి నూరిపోసింది. పక్కింటి మహిళ నూర్ జహాన్ మాయమాటలు విన్న విజయలక్ష్మి ఆమె భర్త నాగేష్ తో గొడపడటం మొదలు పెట్టిందని, చివరికి విడాకులు ఇవ్వడానికి కోర్టు వరకు వెళ్లిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

Recommended Video

    Who Is Parag Agarwal ? | List Of Indian CEO's In Global Tech Co's || Oneindia Telugu
    మతం మారడం ఇష్టం లేక ఆత్మహత్య

    మతం మారడం ఇష్టం లేక ఆత్మహత్య

    తన భార్య విజయలక్ష్మి మతం మారుతున్న ఈ విషయం జీర్ణించుకోలేని నాగేష్ అతని భార్య విజయలక్ష్మితో పాటు ఇద్దరు బిడ్డలను చంపేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడని మంగళూరు సిటీ పోలీసు కమీషనర్ శశికుమార్ మీడియాకు చెప్పారు. ఒకే ఇంటిలో నలుగురు చావులకు కారణం అయిన నూర్ జహాన్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని మంగళూరు సిటీ పోలీసు కమీషనర్ శశికుమార్ మీడియాకు చెప్పారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+