Beating Retreat: ఢిల్లీలో అదరగొట్టిన బీటింగ్ రిట్రీట్..! రిపబ్లిక్ వేడుకలకు శుభంకార్డు..!
ఢిల్లీలో ప్రతీ ఏటా నిర్వహించిన రిపబ్లిక్ డే (republic day) వేడుకల ముగింపుకు సూచికగా విజయ్ చౌక్ లో బీటింగ్ రిట్రీట్ (beating retreat) కూడా జరుగుతుంది. మన దేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారికంగా ముగించే సంప్రదాయంగా బీటింగ్ రిట్రీట్ వేడుకను భావిస్తారు. భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం, ఢిల్లీ పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు దళాల బ్యాండ్‌లు ప్రదర్శించే సంగీత దృశ్యం ఇది.
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధ్యక్షతన ఇవాళ విజయ్ చౌక్ లో బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం కనుల విందుగా సాగింది. భారత సాయుధ దళాల క్రమశిక్షణ, ఐక్యత, జాతీయ వేడుకల ఉత్సవ ముగింపుకు అద్దంపట్టేలా దీన్ని నిర్వహించారు. ఈ సంవత్సరం "వందేమాతరం" యొక్క 150వ వార్షికోత్సవాన్ని గుర్తుచేసేలా దీన్ని నిర్వహించారు. ఇందులో త్రివిధ దళాల ప్రదర్శనలు అత్యంత ఆకట్టుకున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోడీతో పాటు రాజకీయ నేతలు, ప్రజలు, ప్రముఖులు భారీ ఎత్తున హాజరై ఈ వేడుకను తిలకించారు.

VIDEO | Delhi: Visuals from the Beating Retreat Ceremony 2026 at Vijay Chowk, marking the culmination of the 77th Republic Day celebrations.#BeatingRetreat
— Press Trust of India (@PTI_News) January 29, 2026
(Source: Third Party) pic.twitter.com/wbYpYHYQeu
త్రివిధ దళాలు, ఢిల్లీ పోలీసులతో కూడిన బృందాలు మొత్తం 30 ఆకర్షణీయమైన సంగీత ప్రదర్శనలను అందించాయి. సాంప్రదాయ, సమకాలీన భారతీయ కూర్పులను ఇందులో ప్రదర్శించారు. రైసినా హిల్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ ప్రకాశవంతమైన వెలుగుల మధ్య అక్కడికి వచ్చిన ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం ఆస్వాదించారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ బీటింగ్ రిట్రీట్ వేడుకపై ట్వీట్ చేశారు. బీటింగ్ రిట్రీట్ వేడుక 2026 భారతదేశ గొప్ప సైనిక వారసత్వాన్ని ఎలా ప్రదర్శిస్తుందో ఇందులో వివరించారు. అలాగే దేశాన్ని రక్షించడానికి తమ ప్రాణాలను అంకితం చేసే సాయుధ దళాల పట్ల ఆయన గౌరవానికి ఈ ట్వీట్ నిదర్శనంగా నిలిచింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications