Revenge: కోర్టు బయట గ్యాంగ్ స్టర్ ను లేపేశారు, కోర్టు విచారణకు హాజరైన దాదాకు గేట్ పాస్ !
జైపూర్/ రాజస్థాన్: హత్యలు, హత్యాయత్నాలతో పాటు పలు క్రిమినల్ కేసుల్లో అతని మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని పేరు రౌడీషీటర్ జాబితాలో చేరడంతో పాటు గ్యాంగ్ స్టర్ గా ఎదిగిపోయాడు. కోర్టు విచారణకు హాజరైన ఆ గ్యాంగ్ స్టర్ ను పక్కాప్లాన్ తో హత్య చెయ్యడం కలకలం రేపింది.

పక్కా క్రిమినల్
రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లాలో సందీప్ సేథి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సందీప్ సేథీ మీద పలు హత్యలు, హత్యాయత్నాలతో పాటు పలు క్రిమినల్ కేసుల్లో అతని మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. సందీప్ సేథీని అరెస్టు చేసిన పోలీసులు జైలుకు పంపించారు. చాలాకాలం పాటు జైలు జీవితం గడిపిన సందీప్ సేథీ బెయిల్ మీద మూడు రోజుల క్రితమే బయటకు వచ్చాడు.

కోర్టు బయట గ్యాంగ్ స్టర్ క్లోజ్
బెయిల్ మీద బయటకు వచ్చిన గ్యాంగ్ స్టర్ సందీప్ సేథీ సోమవారం నౌగర్ జిల్లా కోర్టు ముందు విచారణకు హాజరుకావడానికి వెళ్లాడు. కోర్టు విచారణకు హాజరైన సందీప్ సేథీ అతని అనుచరులతో కలిసి బయటకు వచ్చాడు. ఆ సందర్బంలో బైక్ ల్లో వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు గ్యాంగ్ స్టర్ సందీప్ సేథీ మీద కాల్పులు జరిపారు.

బెయిల్ మీద వచ్చాడని ?
ప్రత్యర్థులు జరిపిన కాల్పుల్లో సందీప్ సేథీతొ పాటు అతని ఇద్దరు బాడీగార్డ్స్, ఇద్దరు అనుచరులకు బుల్టెట్ గాయాలైనాయి. ఈ దాడిలో గ్యాంగ్ స్టర్ సందీప్ సేథీ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సందీప్ సేథీ బాడీగార్డ్స్ తో పాటు మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో వారిని జైపూర్ లోని ఆసుపత్రికి తరలించారు. పట్టపగలు కోర్టు సమీపంలో గ్యాంగ్ స్టర్ సందీప్ సౌదీని దారుణంగా హత్య చెయ్యడం రాజస్థాన్ లో కలకలం రేపింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications