Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Revenge: క్యాబ్ డ్రైవర్ తో నగ్నంగా నాగిని డ్యాన్స్ చేపించిన జ్యోతిష్యుడు, వీడియో వైరల్, చిలక జోస్యం !

బెంగళూరు: మూడనమ్మకాలు ఉన్న ప్రజలను టార్గెట్ చేసుకుని జోతిష్యం చెబుతున్న ఓ వ్యక్తి లక్షలు లక్షలు డబ్బులు సంపాధిస్తున్నాడు. అమాయకులను నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఆ జ్యోతిష్యుడు తెలిసిన వారికి వడ్డీకి డబ్బులు ఇచ్చి ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడని తెలిసింది. కుటుంబ అవసరాల కోసం కష్టాల్లో ఉన్న ఓ క్యాబ్ డ్రైవర్ ఆ జ్యోతిష్యుడి దగ్గర అప్పు తీసుకున్నాడు. కొంతకాలం క్యాబ్ డ్రైవర్ ఆ జ్యోతిష్యుడికి వడ్డీ చెల్లిస్తున్నాడని తెలిసింది. కరోనా దెబ్బతో క్యాబ్ మూలపడటంతో ఆర్థికంగా డ్రైవర్ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తన దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలని జ్యోతిష్యుడు అతని మీద ఒత్తిడి చేశాడు. చివరికి డబ్బులు వసూలు కాలేదని కసితో రగిలిపోయిన జ్యోతిష్యుడు ఆ క్యాబ్ డ్రైవర్ ను పిలిపించుకున్నాడు. జ్యోతిష్యుడు, అతని ఫ్రెండ్స్ కలిసి క్యాబ్ డ్రైవర్ ను నగ్నంగా తయారు చేసి అతనితో నాగిని డ్యాన్స్ చేయించి వీడియో తీసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం కలకలం రేపింది. తన పరువు బజారున పడిందని తెలుసుకున్న క్యాబ్ డ్రైవర్ పోలీసులను ఆశ్రయించడంతో జ్యోతిష్యుడు అతని ఫ్రెండ్స్ అడ్డంగా బుక్కైపోయారు. పోలీసులు ఇప్పుడు ఆ జ్యోతిష్యుడి తలరాతను మార్చేసి అతనికి చిలక జ్యోస్యం చెబుతున్నారు.

 అమాయకులను కుచ్చుటోపి !

అమాయకులను కుచ్చుటోపి !


ఐటీ హబ్ బెంగళూరు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఐటీ హబ్ నిలయంగా మారిన బెంగళూరులో రకరకాల మనుషులు జీవిస్తున్నారు. బెంగళూరులో సాఫ్ట్ వేర్ కంపెనీలతో పాటు పోటీ పడి మరీ జోతిష్యం చెప్పే వాళ్లు ఆఫీసులు పెట్టుకున్నారు. కష్టాల్లో ఉన్న వారి బలహీనతను టార్గెట్ చేసుకుంటున్న కొందరు కిలాడీ జ్యోతిష్యులు వారిని నిలువునా ముంచేస్తున్నారని అనేక సంఘటనలు వెలుగు చూశాయి.

 కేఆర్ పురంలో జ్యోతిష్యుడు

కేఆర్ పురంలో జ్యోతిష్యుడు

బెంగళూరులోని కేఆర్ పురంలో దయాళ్ మంజు అలియాస్ పులి మంజు అలియాస్ మంజు అనే జ్యోతిష్యుడు నివాసం ఉంటున్నాడు. మూడనమ్మకాలు ఉన్న ప్రజలను టార్గెట్ చేసుకుని జోతిష్యం చెబుతున్న పులి మంజు లక్షలు లక్షలు డబ్బులు సంపాధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. పులి మంజు దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోవడానికి చాలా మంది వెళ్లి వస్తున్నారు.

రూ. 2 లక్షలు అప్పు తీసుకున్న క్యాబ్ డ్రైవర్

రూ. 2 లక్షలు అప్పు తీసుకున్న క్యాబ్ డ్రైవర్

అమాయకులను నుంచి పూజల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న జ్యోతిష్యుడు పులి మంజు తెలిసిన వారికి వడ్డీకి డబ్బులు ఇచ్చి ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడని తెలిసింది. కుటుంబ అవసరాల కోసం కష్టాల్లో ఉన్న కేఆర్ పురంలోని ఓ క్యాబ్ డ్రైవర్ జ్యోతిష్యుడు పులి మంజు దగ్గర రూ. 2 లక్షలు అప్పు తీసుకున్నాడు. కొంతకాలం ప్రతి నెల క్యాబ్ డ్రైవర్ జ్యోతిష్యుడు పులి మంజుకు వడ్డీ చెల్లిస్తున్నాడని తెలిసింది.

కరోనా దెబ్బతో ఆర్థిక సమస్యలు

కరోనా దెబ్బతో ఆర్థిక సమస్యలు

కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బతో బెంగళూరులో దాదాపుగా క్యాబ్ లు మూలపడ్డాయి. క్యాబ్ తిరగకపోవడంతో జ్యోతిష్యుడు పులి మంజు దగ్గర అప్పు చేసిన డ్రైవర్ ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కొంతకాలం ఆగితే తీసుకున్న డబ్బుతో పాటు వడ్డీ కూడా పూర్తిగా చెల్లిస్తానని క్యాబ్ డ్రైవర్ జ్యోతిష్యుడు పులి మంజుకు మనవి చేశాడని తెలిసింది.

 నమ్మించి పిలిపించుకున్న జ్యోతిష్యుడు

నమ్మించి పిలిపించుకున్న జ్యోతిష్యుడు

తన దగ్గర తీసుకున్న డబ్బులు వెంటనే తిరిగి చెల్లించాలని జ్యోతిష్యుడు పులి మంజు క్యాబ్ డ్రైవర్ మీద మీద ఒత్తిడి చేశాడు. చివరికి డబ్బులు వసూలు కాలేదని కసితో రగిలిపోయిన జ్యోతిష్యుడు పులి మంజు ఆ క్యాబ్ డ్రైవర్ ను అతని ఆఫీసుకు పిలిపించుకున్నాడు. జ్యోతిష్యుడు పులి మంజుతో పాటు అతని స్నేహితులు క్యాబ్ డ్రైవర్ మీద చెయ్యి చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

 నగ్నంగా నాగిని డ్యాన్స్ చేపించి వీడియో తీసి ?

నగ్నంగా నాగిని డ్యాన్స్ చేపించి వీడియో తీసి ?

జ్యోతిష్యుడు పులి మంజు, అతని ఫ్రెండ్స్ కలిసి క్యాబ్ డ్రైవర్ ను నగ్నంగా తయారు చేసి అతనితో నాగిని డ్యాన్స్ చేయించి వీడియో తీసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం కలకలం రేపింది. తన పరువు బజారున పడిందని తెలుసుకున్న క్యాబ్ డ్రైవర్ కేఆర్ పురం పోలీసులను ఆశ్రయించి జ్యోతిష్యుడు అతని ఫ్రెండ్స్ మీద కేసు పెట్టడంతో అందరూ అడ్డంగా బుక్కైపోయారు. పోలీసులు ఇప్పుడు జ్యోతిష్యుడు పులి మంజు, అతని స్నేహితుల మీద కేసు నమోదు చేసి అందరికి చిలక జ్యోస్యం చెప్పడానికి సిద్దం అయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+