Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Revenge: పండగ రోజు బస్ స్టాండ్ లో కానిస్టేబుల్ కొడుకును వెంటాడి నరికి చంపేశారు, ఏం జరిగిందంటే !

బెంగళూరు/ కలబురిగి: కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అతని కొడుకును బాగా చదివించాడు. ఎప్పటికైనా తాను పోలీసు శాఖలో ఎస్ఐగా లేదా కానిస్టేబుల్ గా ఉద్యోగం సంపాధించాలని పోలీసు కొడుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. క్రమం తప్పకుండా పోలీసు కొడుకు జిమ్ కు వెలుతున్నాడు. స్నేహితులతో కలిసి పోలీసు కొడుకు ఎంజాయ్ చేస్తున్నాడు. దీపావళి పండుగ రోజు ఇంట్లో శుభ్రంగా స్నానం చేసి దేవుడికి పూజ చెయ్యాలని తల్లి చెప్పింది. తాను జిమ్ కు వెళ్లి వస్తానని, తరువాత స్నానం చేసి పూజ చేస్తానని ఆ యువకుడు అతని తల్లికి చెప్పాడు. స్నానం చేసి బయటకు వెళ్లాలని తల్లి చెబుతున్నా అతను ఏమాత్రం పట్టించుకోలేదు. బైక్ లో జిమ్ చెయ్యడానికి వెలుతున్న యువకుడిని అతని ప్రత్యర్థులు వెంబడించారు. ఒక్కసారిగా కత్తులతో దాడి చెయ్యడంతో పోలీసు కొడుకు వారి నుంచి తప్పించుకోవాలని బైక్ రోడ్డు మీద వదిలేసి బస్ స్టాండ్ లోకి పరుగు తీశాడు, బస్ స్టాండ్ లో ఉన్న వారిని తనను కాపాడాలని పోలీసు కొడుకు వేడుకున్నాడు. అయితే ప్రత్యర్థులు బస్ స్టాండ్ లోనే పోలీసు కొడుకును వెంటాడి వెంటాడని దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది. పండుగ రోజు ఊరికి వెళ్లడానికి బస్ స్టాండ్ కు వెళ్లిన ప్రయాణికులు వారి కళ్ల ముందే దారుణ హత్య జరగడంతో భయంతో పరుగు తీశారు.

 పోలీసు కొడుకు

పోలీసు కొడుకు

కర్ణాటకలోని కలబురిగి (జిల్లా కేంద్రం)లోని విద్యాసాగర్ నగర్ లో అభిషేక్ చంద్రకాంత్ (27) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అభిషేక్ తండ్రి కలబురిగిలో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అతని కొడుకు అభిషేక్ చంద్రకాంత్ ను బాగా చదివించాడు.

 ఎస్ఐ ఉద్యోగం చెయ్యాలని ఆశపడ్డాడు

ఎస్ఐ ఉద్యోగం చెయ్యాలని ఆశపడ్డాడు

ఎప్పటికైనా తాను పోలీసు శాఖలో ఎస్ఐగా లేదా కానిస్టేబుల్ గా ఉద్యోగం సంపాధించాలని పోలీసు కొడుకు అభిషేక్ చంద్రకాంత్ అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. క్రమం తప్పకుండా అభిషేక్ చంద్రకాంత్ కలబురిగిలోని ఓ జిమ్ సెంటర్ కు వెళ్లి వ్యాయామం చేస్తున్నాడు. అభిషేక్ అతని స్నేహితులతో కలిసి సాయంత్రం పూట తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.

 దీపావళి రోజు స్నానం చెయ్యాలని చెప్పిన తల్లి

దీపావళి రోజు స్నానం చెయ్యాలని చెప్పిన తల్లి

గురువారం ఉదయం నిద్రలేచిన అభిషేక్ బయటకు వెళ్లడానికి సిద్దం అయ్యాడు. దీపావళి పండుగ రోజు ఇంట్లో శుభ్రంగా స్నానం చేసి దేవుడికి పూజ చెయ్యాలని అభిషేక్ కు అతని తల్లి చెప్పింది. తాను జిమ్ కు వెళ్లి వస్తానని, తరువాత స్నానం చేసి పూజ చేస్తానని అభిషేక్ అతని తల్లికి చెప్పాడు. స్నానం చేసి బయటకు వెళ్లాలని తల్లి చెబుతున్నా అభిషేక్ ఏమాత్రం పట్టించుకోలేదు.

 కాళ్లు పట్టుకున్న పోలీసు కొడుకు

కాళ్లు పట్టుకున్న పోలీసు కొడుకు

బైక్ లో జిమ్ సెంటర్ కు వెలుతున్న అభిషేక్ ను మార్గం మధ్యలో అతని ప్రత్యర్థులు వెంబడించారు. ఒక్కసారిగా కత్తులతో దాడి చెయ్యడంతో పోలీసు కొడుకు అభిషేక్ వారి నుంచి తప్పించుకోవాలని బైక్ రోడ్డు మీద వదిలేసి బస్ స్టాండ్ లోకి పరుగు తీశాడు, బస్ స్టాండ్ లో ఉన్న వారిని తనను కాపాడాలని పోలీసు కొడుకు అభిషేక్ వేడుకున్నాడు. కనపడివారి కాళ్లు పట్టుకున్న అభిషేక్ వారి మధ్య దాక్కోవాలని ప్రయత్నించాడు.

Recommended Video

    ఏపిలో అరాచకం రాజ్యమేలుతుందన్న టీడిపి జాతీయ అధికార ప్రతినిధి దివ్యవాణి || Oneindia Telugu
     బస్ స్టాండ్ లో దారుణంగా నరికి చంపేశారు

    బస్ స్టాండ్ లో దారుణంగా నరికి చంపేశారు

    ప్రత్యర్థులు బస్ స్టాండ్ లోనే పోలీసు కొడుకు అభిషేక్ ను వెంటాడి వెంటాడని దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది. అభిషేక్ ను హత్య చేసిన ప్రత్యర్థులు అక్కడి నుంచి దర్జాగా వెళళ్లిపోయారు. పండుగ రోజు ఊరికి వెళ్లడానికి బస్ స్టాండ్ కు వెళ్లిన ప్రయాణికులు వారి కళ్ల ముందే అభిషేక్ దారుణ హత్యకు గురికావడంతో వారు భయంతో పరుగు తీశారు. విషయం తెలుసుకున్న ఏసీపీ అంశ కుమార్, ఇన్స్ పెక్టర్ పండిత సాగర్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అభిషేక్ హత్యకు ఇంకా కచ్చితమైన కారణాలు తెలీయడం లేదని ఏసీపీ అంశకుమార్ అంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+