Revenge: ఎక్కడ చిక్కాలో అక్కడే చిక్కాడు, రౌడీషీటర్ ను ఏం చేశారంటే ?, సినిమా థియేటర్ ?
బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు నగరంలో మరోసారి పాతకక్షలు భగ్గుమన్నాయి. యాక్టీవాలో వెలుతున్న రౌడీషీటర్ ను లేపేయాలని స్కెచ్ వేసిన ప్రత్యర్థులు ఆటోలు, బైక్ ల్లో వెంబడించారు. సినిమా ఫక్కీలో రౌడీషీటర్ స్కూటర్ ను ఢీకొట్టిన ప్రత్యర్థులు నడిరోడ్డులోనే అతన్ని ఇష్టం వచ్చినట్లు నరికేశారు,
బెంగళూరు నగరంలో గణేష్ అలియాస్ కుందాప్రి వ్యాపారం చేస్తున్నాడు. మంగళవారం బెంగళూరులోని మల్లేశ్వరంలోని మంత్రిమాల్ సమీపంలోని నటరాజ్ సినిమా థియేటర్ పక్కరోడ్డులో స్కూటర్ మీద వెలుతున్నాడు. ఆ సందర్బంలో బైక్ లు, ఆటోల్లో వెళ్లిన ప్రత్యర్థులు గణేష్ మీద వేటకొడవళ్లు, కత్తులతో దాడి చేశారు.

గణేష్ తప్పించుకోకుండా ప్రత్యర్థులు ఇష్టం వచ్చినట్లు నరికేశారు, గణేష్ ప్రాణం పోయింది అనుకుని అతన్ని వదిలేసి వెళ్లిపోయారు. తీవ్రగాయాలైన గణేష్ ను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రౌడీషీటర్ గణేష్ పరిస్థితి విషమంగా ఉందని, అతన్ని ఎవరు హత్య చెయ్యాలని అనుకున్నారు అని ఆరా తీస్తున్నామని శేషాద్రిపురం పోలీసులు అంటున్నారు.
2020లో కినో థియేటర్ సమీపంలో జరిగిన హత్య కేసులో రౌడీషీటర్ గణేష్ నిందితుడని పోలీసులు అంటున్నారు, గతంలో గణేష్ మీద అనేక కేసులు నమోదు అయ్యాయని, పాతకక్షల కాణంగానే అతన్ని హత్య చెయ్యడానికి ప్రత్యర్థులు ప్రయత్నించారని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications