• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీనేజ్ అమ్మాయితో ఎమ్మెల్యేల‌ అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌! బ‌ల‌వంతంగా డాన్స్‌!

|

ఇంఫాల్‌: ఇద్ద‌రు టీనేజ్ అమ్మాయిల‌తో కొంద‌రు శాస‌న స‌భ్యులు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ఉదంతం ఇది. ఆ ఇద్ద‌రు యువ‌తుల‌తో ఒంటిపై చేతులు వేస్తూ ఆడి, పాడారు ఆ ఎమ్మెల్యేలు. వారికి ఇష్టం లేక‌పోయినా బ‌ల‌వంతంగా చిందులేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఆయ‌న‌ పేరు య‌దువంశ్ కుమార్ యాద‌వ్‌. బిహార్ ప్ర‌తిప‌క్ష పార్టీ రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్‌కు చెందిన ఎమ్మెల్యే. యాక్ట్ ఈస్ట్ పేరుతో కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ప్ర‌తినిధుల బృందానికి ఛైర్మ‌న్ కూడా. ఈశాన్య రాష్ట్రాల్లో ప‌ర్య‌టించి, వాటిని అభివృద్ధి చేయ‌డంపై అధ్య‌య‌నం చేయ‌డం, కేంద్ర‌ప్ర‌భుత్వానికి స‌మ‌గ్ర నివేదిక‌ను అంద‌జేయ‌డం ఈ ప్ర‌తినిధుల బృందం విధి.

RJD MLA Seen Hugging, Dancing With Teen Girl Who is Visibly Uncomfortable in Manipur

ఈ అధ్య‌య‌నంలో భాగంగా య‌దువంశ్ కుమార్ యాద‌వ్ ఇత‌ర ప్ర‌తినిధుల‌తో క‌లిసి మ‌ణిపూర్‌లోని మోరే ప‌ట్ట‌ణానికి వెళ్లారు. భార‌త్‌-మయ‌న్మార్ స‌రిహ‌ద్దుల‌కు ఆనుకుని ఉంటుంది ఈ ప‌ట్ట‌ణం. త‌న ప‌ర్య‌ట‌న ముగించుకుని ప్ర‌భుత్వ అతిథి గృహానికి వ‌చ్చిన త‌రువాత ఇద్ద‌రు మ‌ణిపురి అమ్మాయిల‌తో య‌దువంశ్ కుమార్ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. వారితో క‌లిసి డాన్స్ చేశాడు. ఈ నెల 1వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. వీడియోతో పాటు ఆ ఎమ్మెల్యేల నిజ స్వ‌రూపం బ‌హిర్గ‌త‌మైంది.

ఆ స‌మ‌యంలో ఆయ‌న వెంట బీజేపీకి చెందిన సచిన్ ప్రసాద్ సింగ్, జ‌న‌తాద‌ళ్ (యునైటెడ్‌) ఎమ్మెల్యే రాజ్ కుమార్ రాయ్, ఆర్జేడీకే చెందిన మ‌రో ఎమ్మెల్యే రాజా ప‌క‌ర్ కూడా ఉన్న‌ట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఇంఫాల్ టైమ్స్ దిన‌ప‌త్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. ఓ మ‌ణిపురి పాట‌కు అనుగుణంగా స్థానిక యువ‌తితో క‌లిసి ఎమ్మెల్యే స్టెప్పులు వేయడం ఈ వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. కాగా- ఈ వీడియో వెలుగులోకి వ‌చ్చిన వెంట‌నే బిహార్‌లో రాజ‌కీయ దుమారం రాజుకుంది. వారంద‌ర్నీ వెంట‌నే స‌స్పెండ్ చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

కాగా- ఈ వీడియోతో త‌మ‌కు సంబంధం లేద‌ని య‌దువంశ్ కుమార్ యాద‌వ్ స‌హా మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ వీడియో నకిలీద‌ని అంటున్నారు. తమ‌ను అప్ర‌తిష్ఠ‌పాలు చేయ‌డానికి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఈ వీడియోను రూపొందించార‌ని ఎదురుదాడికి దిగుతున్నారు.

English summary
In a bizarre incident, a Rashtriya Janata Dal (RJD) MLA was caught on camera forcing a girl to dance with him in Moreh town in Manipur. According to reports, RJD leader Yaduvansh Kumar Yadav, was reportedly on a study tour in Manipur when the incident took place. According to a video that went viral on social media, the Bihar legislator is seen trying to hold the girl's shoulder even as she removes his hand. Yadav is also accompanied by four men.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more