Romance: కొండ మీద ప్రేమికులు రొమాన్స్, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్, కింగ్ పిన్ ఎవరంటే ?
చెన్నై/మదురై: యువకుడితో ఓ యువతికి పరిచయం అయ్యింది. కొంతకాలం ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. రానురాను ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ప్రియుడు అతని ప్రియురాలికి తియ్యటి మాటలు చెప్పాడు. నా ప్రియుడు చాలా మంచివాడని, అతన్ని పెళ్లి చేసుకుంటే జీవితాంతం సుఖంగా ఉండటానికి అవకాశం ఉంటుందని ప్రియరాలు అనుకుంది. ప్రియుడు పిలిచాడని కొండ మీద రహస్య ప్రాంతానికి ప్రియురాలు వెళ్లింది. ఆ సందర్బంలో ఓపెన్ ప్లేస్ లో ఇద్దరూ నగ్నంగా ఏకాంతంగా గడిపారు. అదే సమయంలో ప్రేమికులు ఎంజాయ్ చేస్తున్న సమయంలో కొందరు మొబైల్ ఫోన్లలో వీడియోలు తీశారు. తరువాత ప్రియురాలికి ఆ వీడియోలతో సినిమా చూపించారు. అక్కడి నుంచి కథ ఊహించని మలుపు తిరిగింది.

మైనర్ అమ్మాయితో
తమిళనాడులోని మదురై జిల్లాలోని మంగళంపట్టిలో శివరామన్ (21) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. గత ఏడాది మధురైలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల యువతి శివరామన్ కు పరిచయం అయ్యింది. కొంతకాలం శివరామన్, ఆ యువతి ఫోన్ లో మాట్లాడుకున్నారు. రానురాను ఇద్దరు నేరుగా కలుసుకుని గంటలు గంటలు మాట్లాడుకున్నారు. తరువాత శివరామన్ తో మైనర్ అమ్మాయి ప్రేమలో పడింది.

ప్రియుడిని గుడ్డిగా నమ్మింది
ప్రియుడు శివరామన్ ను మైనర్ అమ్మాయి గుడ్డిగా నమ్మింది. శివరామన్ ను పెళ్లి చేసుకోవాలని మైనర్ అమ్మాయి డిసైడ్ అయ్యింది. కొన్ని వారాల క్రితం మేలూరు ప్రాంతంలోని కీజావల కొండపైకి రావాలని శివరామన్ అతని ప్రియురాలికి ఫోన్ చేసి చెప్పాడు. అప్పటికే ప్రియుడు శివరామన్ ను గుడ్డిగా నమ్మింని మైనర్ అమ్మాయి సరే అని చెప్పింది. ఆ అమ్మాయి తన ప్రియుడిని నమ్మి అతను చెప్పిన చోటకు వెళ్లింది.

కొండల మీద ఎంజాయ్
శివరామన్ అతని గర్ల్ ఫ్రెండ్ తో కలిసి పర్వతాల మీదకు వెళ్లాడు. తరువాత శివరామన్ అతని ప్రియురాలిని లొంగదీసుకున్నాడు. ఆ సమయంలో ఏం చెయ్యాలో తెలీక ప్రియురాలు సైతం అతని ప్రియుడి కోరికను తీర్చాలని అనుకుంది. శివరామన్, అతని ప్రియురాలు నగ్నంగా ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టారు. మైనర్ అమ్మాయి ఆమె ప్రియుడు శివరామన్ సర్వస్వం అనుకుని అతను చెప్పినట్లు అంతా చేసింది.

మొబైల్ లో సీక్రేట్ వీడియోలు తీసి ?
అదే కొండ మీద దాక్కొన్న ఇద్దరు నిందితులు శివరామన్, అతని ప్రియురాలు నగ్నంగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో రెండు మొబైల్ ఫోన్లలో సీక్రేట్ గా వీడియోలు తీశారు. ఆ వీడియోను చూపించి యువతితో పాటు ఆమె ప్రియుడు శివకుమార్ ను బెదిరించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని మైనర్ అమ్మాయిని బెదిరించిన నిందితులు ఆమె మీద లైంగికదాడి చేశారు. ఆమె శరీరం మీద ఉన్న 30 గ్రాముల బంగారు నగలు లాక్కొన్నారు.

హడలిపోయిన ప్రియురాలు
ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న సమయంలో తీసిన వీడియో చూపించిన నిందితులు ఆ అమ్మాయి నుండి డబ్బు వసూలు చేయడం ప్రారంభించారు. పరువు పోతుందనే భయంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులకు తెలియకుండా ఇంటి నుంచి డబ్బులు, బంగారు నగలు చోరీ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకులకు ఇస్తూ వచ్చింది. రానురాను నిందితులు టార్చర్ ఎక్కువ కావడంతో ఆమె సహనం కోల్పోయింది. ఇదే సమయంలో ప్రియురాలిని ఆమె ప్రియుడి తీరుమీద అనుమానం వచ్చింది.

నగ్న వీడియోల ఎలా తీశారు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ప్రియుడే
విసిగిపోయిన ప్రియురాలు చివరికి జరిగిన విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. కూతురు చెప్పిన స్టోరీ విని షాక్‌కు గురైన యువతి తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్‌లో నిందితుల మీద ఫిర్యాదు చేశారు. మైనర్ అమ్మాయి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మేళవలుకు చెందిన విజయకుమార్, ఉత్తంగుడికి చెందిన వినోద్‌కుమార్ అనే ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే సమాచారం బయటకు వచ్చింది.

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ప్రియుడే
యువతి నగ్న వీడియోలు ఆమె ప్రియుడు శివరామన్ తియ్యమంటే తీశామని ఇద్దరు నిందితులు చెప్పారు. పోలీసులు మైనర్ అమ్మాయి ప్రియుడు శివరామన్ ను అరెస్టు చేశారు. యువతి ప్రియుడు శివరామన్ పథకం ప్రకారమే ఈ బ్లాక్ మెయిల్ డ్రామాకు తెరలేపినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ప్రియుడు శివరామన్ తో పాటు పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి మదురై సెంట్రల్ జైలుకు తరలించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications