Rowdy: లిఫ్ట్ లో భార్య చెయ్యి టచ్ చేశాడని మైనర్ అబ్బాయిని ఏం చేశాడంటే ?, రౌడీషీటర్ అరాచకంతో !

బెంగళూరు/ హాసన్: వాడు సిటీలో పెద్ద రౌడీషీటర్. పెళ్లి చేసుకుని భార్యతో కాపురం చేస్తున్నా రౌడీయిజం మాత్రం చేస్తూనే ఉన్నాడు. ప్రతిరోజూ అనుచరులను వెంటపెట్టుకుని వెళ్లి దందాలు, సెటిల్ మెంట్లు చేస్తున్నాడు. రౌడీషీటర్ స్నేహితుడి బర్త్ డే పార్టీ ఓ పబ్ లో ఏర్పాటు చేశారు. రౌడీషీటర్ అతని భార్య, అనుచరులతో కలిసి పబ్ లో ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లాడు. బర్త్ డే పార్టీ ముగించుకుని భార్యతో కలిసి పబ్ లో నుంచి బయటకు రావడానికి లిఫ్ట్ లోకి వెళ్లాడు. అదే పబ్ లో ఉన్న ఓ మైనర్ అబ్బాయి లిఫ్ట్ ఎక్కాడు. ఆ సందర్బంలో లిఫ్ట్ లో ఆకస్మికంగా మైనర్ అబ్బాయి చెయ్యి రౌడీషీటర్ భార్య చెయ్యికి తగిలింది. నా ముందే నా భార్య చెయ్యిని టచ్ చేస్తావా ? అంటూ రౌడీషీటర్ రెచ్చిపోయాడు. అక్కడి నుంచి ఎవరిపాటికి వాళ్లు వెళ్లిపోయారు. భార్య చెయ్యిని టచ్ చేశాడని రెచ్చిపోయిన రౌడీషీటర్ మైనర్ అబ్బాయిని కిడ్నాప్ చేసి అతి దారుణంగా హత్య చేసి శవాన్ని నదిలో విసిరేసి తప్పించుకోవడం కలకలం రేపింది.

 రౌడీషీటర్

రౌడీషీటర్

కర్ణాటకలోని హాసన్ నగరంలో రాఖీ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. హాసన్ సిటీలో రాఖీ పెద్ద రౌడీషీటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాఖీ మీద ఇప్పటికే అనేక క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. పెళ్లి చేసుకుని భార్యతో కాపురం చేస్తున్నా రాఖీ మాత్రం రౌడీయిజం మాత్రం చేస్తూనే ఉన్నాడు. ప్రతిరోజూ రాఖీ అనుచరులను వెంటపెట్టుకుని వెళ్లి దందాలు, సెటిల్ మెంట్లు చేస్తున్నాడు.

ఫ్రెండ్ బర్త్ డే పార్టీ

ఫ్రెండ్ బర్త్ డే పార్టీ


రౌడీషీటర్ రాఖీ స్నేహితుడి బర్త్ డే పార్టీ హాసన్ లోని బీఎం రోడ్డులోని ఓ ఫేమస్ పబ్ లో ఏర్పాటు చేశారు. రౌడీషీటర్ రాఖీ అతని భార్య, అనుచరులతో కలిసి పబ్ లో ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లాడు. బర్త్ డే పార్టీలో రాఖీ అతని అనుచరులు పీకలదాకా మద్యం సేవించి ఎంజాయ్ చేశారు. బర్త్ డే పార్టీ ముగించుకున్న రౌడీషీటర్ రాఖీ అతని భార్యతో కలిసి పబ్ లో నుంచి బయటకు రావడానికి లిఫ్ట్ లోకి వెళ్లాడు.

భార్య చెయ్యికి అబ్బాయి చెయ్యి తగిలింది

భార్య చెయ్యికి అబ్బాయి చెయ్యి తగిలింది

అదే పబ్ లో ఉన్న ఓ మైనర్ అబ్బాయి రౌడీషీటర్ రాఖీ లిఫ్ట్ ఎక్కిన సమయంలోనే అదే లిఫ్ట్ లోకి వెళ్లాడు. ఆ సందర్బంలో లిఫ్ట్ లో ఆకస్మికంగా మైనర్ అబ్బాయి చెయ్యి రౌడీషీటర్ రాఖీ భార్య చెయ్యికి తగిలింది. నా ముందే నా భార్య చెయ్యిని టచ్ చేస్తావా ? అంటూ రౌడీషీటర్ రాఖీ ఆ అబ్బాయి మీద రెచ్చిపోయి చితకబాదేశాడు. అక్కడి నుంచి ఎవరిపాటికి వాళ్లు వెళ్లిపోయారు.

అబ్బాయిని కిడ్నాప్ చేసి చంపేసిన రౌడీషీటర్

అబ్బాయిని కిడ్నాప్ చేసి చంపేసిన రౌడీషీటర్

నా భార్య చెయ్యిని టచ్ చేశాడని రెచ్చిపోయిన రౌడీషీటర్ రాఖీ అతని అనుచరులతో కలిసి వెళ్లి మైనర్ అబ్బాయిని అతని ఇంటిలోనే కిడ్నాప్ చేశాడు. తరువాత నా భార్య చెయ్యి పట్టుకుని ఆమె ముందే నా పరువు తీస్తావా అంటూ ఆ అబ్బాయిని అతి కిరాతకంగా కత్తులతో పొడిచి సి అతి దారుణంగా హత్య చేశారు.

 80 కిలోమీటర్ల దూరంలో శవం విసిరేసి ఎస్కేప్

80 కిలోమీటర్ల దూరంలో శవం విసిరేసి ఎస్కేప్

మైనర్ అబ్బాయిని హత్య చేసిన రౌడీషీటర్ రాఖీ అతని శవాన్ని హాసన్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని సకలేశపుర తాలుకాలోని గండ్య కెంపుహోళ నదిలో విసిరేసిన రాఖీ అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేశాడు. మూడు రోజుల తరువాత మైనర్ అబ్బాయి శవం నది కాలువలో బయటపడింది.

రౌడీషీటర్ అరెస్టు. పోలీసుల అదుపులో భార్య, అనుచరులు

రౌడీషీటర్ అరెస్టు. పోలీసుల అదుపులో భార్య, అనుచరులు

తన కొడుకును రౌడీషీటర్ రాఖీ హత్య చేశాడని బాదితుడి తల్లి కేసు పెట్టింది. పబ్ లో రికార్డు అయిన ఓ వీడియో ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగి మైనర్ అబ్బాయి హత్య కేసులో రౌడీషీటర్ రాఖీని అరెస్టు చేశారు. రౌడీషీటర్ రాఖీ భార్యతో పాటు అతని అనుచరులు 8 మందిని హాసన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+