మాజీ గర్ల్ ఫ్రెండ్ మానం తీస్తానని బెదిరించిన రౌడీషీటర్, యువతి తల్లితో డీల్ సెట్ చేసిన ఫ్రెండ్స్ !
ఐటీ హబ్ బెంగళూరుకు చెందిన రౌడీషీటర్ మనోజ్ అలియాస్ కెంచ మనోజ్ ఓ యువతి న్యూడ్ ఫోటోలు ఆమె కుటుంబ సభ్యులకు పంపించి డబ్బుల కోసం బెదిరించాడు. మనోజ్ అలియాస్ మను అనే రౌడీషీటర్ యువతి న్యూడ్ ఫోటోలను ఆమె కుటుంబ సభ్యులకు పంపి డబ్బులు డిమాండ్ చేశాడు. నేను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే మీ కూతురు భర్తకి మీ కూతురి నగ్న ఫోటోలు పంపిస్తానని రౌడీషీటర్ మనోజ్ బెదిరించాడు.
రౌడీషీటర్ మనోజ్ ఫొటోలు చూపించి యువతి తల్లిదండ్రుల నుంచి ఇప్పటికే డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత మనోజ్ అతని స్నేహితుడు కార్తీక్ మొబైల్ నుంచి వాట్సాప్‌లో కాల్ చేసి తనకు తెలిసిన కుర్రాళ్లు మీ దగ్గరకు వస్తారని, వాళ్లకు రూ.5 లక్షలు ఇవ్వాలని చెప్పాడు. తాను పంపించిన వ్యక్తికి రూ 5 లక్షలు ఇవ్వకుంటే మీ కూతురి నగ్న ఫొటోలు మీ అల్లుడితో పాటు మీ బంధువులకు పంపిస్తానని జైల్లో ఉన్నరౌడీషీటర్ మనోజ్ బెదిరించాడు.

జైలులో ఉన్న మనోజ్ ఫిబ్రవరి 12వ తేదీన జైలు నుంచి తనకు ఫోన్ చేసి ఫోటో మార్ఫింగ్ చేసి బెదిరించాడని యువతి తల్లిదండ్రులు బెంగళూరులోని యలహంక న్యూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు రౌడీషీటర్ మనోజ్ మీద కేసు నమోదు చేశారు. జైలులో ఉన్న రౌడీషీటర్ మనోజ్ కు మొబైల్ ఫోన్ ఎలా వచ్చింది ?, మహిళ ఫోటోలు అతని చేతికి ఎలా వచ్చాయి అని పోలీసులు ఆరా తీశారు. ఇదే సమయంలో మనోజ్ కేసును బెంగళూరు సీసీబీ పోలీసులకు అప్పగించారు.

బెంగళూరులోని యలహంకకు చెందిన రౌడీ షీటర్ మనోజ్ అలియాస్ కెంచ తనకు తెలిసిన అమ్మాయి ఫొటోలను మార్ఫింగ్ చేసి పంపి డబ్బులు డిమాండ్ చేశాడని వెలుగు చూసింది. గత ఆగస్టులో కూడా యువతి తల్లి మొబైల్ ఫోన్‌కు మార్ఫింగ్ ఫొటోలు పంపి డీల్ కోసం ఐదు లక్ష రూపాయలు ఫైనల్ చేయాలని బెదిరించాడని బెంగళూరు సీసీబీ పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
బెంగళూరు సీసీబీ పోలీసులు విచారణ చేపట్టి ఈ కేసుకు సంబంధించి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న మనోజ్ అలియాస్ కెంచ మీద మరో కేసు నమోదు చేశారు. మనోజ్ సహచరులు సుభాష్, యోగేష్‌లను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. రౌడీ షీటర్ కెంచన్ కు సహాయం చేశారనే అభియోగంతో యోగేష్, సుభాష్ లను పోలీసులు అరెస్ట్ చేయగా, జైలులో ఉన్న మనోజ్ అలియాస్ కెంచను బాడీ వారెంట్ పై బెంగళూరు సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకుని యువతి ఫోటోలు మార్ఫింగ్ చెయ్యడానికి అతనికి సహకరించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications