Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Natu Natu Oscar: ప్రపంచ వేదికపై తెలుగోడి విజయం

ఆర్ఆర్ఆర్ చరిత్ర తిరగరాసింది. తెలుగోడి హృదయం ఉప్పొంగేలా చేసింది. నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ప్రపంచ పటంపై జక్కన్న మెరిసారు. జూనియర్ ఎన్టీఆర్ -రాం చరణ్ అభిమానుల సంతోషానికి హద్దులు లేవు. ఆస్కార్ వేదిక పైన నాటు నాటు స్టెప్పులతో దుమ్ము లేచింది. వేదిక పైన బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ ప్రకటన రాగానే ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో డాల్బీ థియేటర్‌ దద్దరిల్లిపోయింది. కీరవాణి..చంద్రబోస్ అవార్డును అందుకున్నారు. నమస్తే అంటూ ఆస్కార్ వేదికపై చంద్రబోస్ ప్రత్యేకంగా నిలిచారు.

RRR Movie Song Natu Natu Won Oscar Celebrations Reached Peak

Mar 13, 2023, 11:57 am IST

ఆస్కార్ అవార్డు అందుకున్న RRR చిత్ర బృందానికి నా అభినందనలు. ముఖ్యంగా రాజమౌళి, కీరవాణి నా ప్రత్యేక అభినందనలు - రజనీకాంత్
Mar 13, 2023, 11:08 am IST

నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై సూపర్ స్టార్ మహేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు. మీరు... నాటు నాటు!! అన్ని హద్దులు దాటుతోంది!! అభినందనలు అని ట్వీట్ చేశారు.
Mar 13, 2023, 11:05 am IST

ఉత్తమ ఒరిజినల్ సాంగ్ నామినీలు కాళ భైరవ & రాహుల్ సిప్లిగంజ్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ #ఆస్కార్స్‌లో #RRR నాటు నాటు" ప్రదర్శనపై మాట్లాడారు.
Mar 13, 2023, 11:04 am IST

"నాటు నాటు" ప్రదర్శనకారులను వేదికపై నుంచి కింది వస్తున్నప్పుడు దర్శకుడు రాజమౌళి, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ చప్పట్లు కొట్టారు.
Mar 13, 2023, 11:01 am IST

ఆస్కార్ అవార్డుల సందర్భంగా మెరిసిపోయిన రామ్ చరణ్, ఉపాసన
Mar 13, 2023, 11:00 am IST

ఈ రాత్రి "నాటు నాటు" ప్రదర్శనపై #RRR దర్శకుడు S.S. రాజమౌళి ఆనందం వ్యక్తం చేశారు. "పాట మొత్తం ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం, ప్రదర్శకులకు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు.
Mar 13, 2023, 10:59 am IST

"ఇది అసాధారణమైనది! #ఆస్కార్స్‌లో భారతీయులమైన మనందరికీ గర్వకారణం!" అని మహారాష్ట్ మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ్న్నారు. #RRR టీమ్, #TheElephant Whisperers టీమ్ కు అభినందనలు తెలిపారు.
Mar 13, 2023, 10:55 am IST

తెలుగు సినీ చరిత్రలో ఇది ఒక అపురూపమైన మైలురాయి దర్శకుడు క్రిష్ అన్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. కీరవారణి, చంద్రబోస్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్, సెంథిల్ కుమార్, రాజమౌళికి అభినందనలు తెలిపారు. రాజమౌళి నుంచి స్ఫూర్తి పొందుతామన్నారు.
Mar 13, 2023, 10:51 am IST

RRRలోని నాటు నాటు పాట చరిత్ర సృష్టించిందని నటుడు వరుణ్ తేజ్ అన్నారు. రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్, రాహుల్ సిప్లిగంజ్ కు అభినందనలు తెలిపారు.
Mar 13, 2023, 10:47 am IST

నాటు నాటు పాటకు ఆస్కార్‌ రావడం చాలా థ్రిల్‌గా ఉందని నిర్మాత శోభు యార్లగడ్డ అన్నారు. #RRR టీమ్‌కు అభినందనలు తెలిపారు.
Mar 13, 2023, 10:42 am IST

నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం భారతీయ సినిమాకు అత్యుత్తమ క్షణాలలో ఒకటని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. #NaatuNaatu పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ప్రతిష్టాత్మక #ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించినందుకు కీరవాణి , చంద్రబోస్, రాజమౌళి, #RRR మొత్తం సిబ్బందికి అభినందనలు తెలిపారు.
Mar 13, 2023, 10:40 am IST

నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై నటుడు దగ్గుబాటి రానా ఆనందం వ్యక్తం చేశారు. ఇది RRR గర్జన అని రాసుకొచ్చారు.
Mar 13, 2023, 10:37 am IST

నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ #RRR టీమ్‌కు అభినందనలు తెలిపారు. దారి అంతా నాటు నాటు అంటూ కామెంట్ చేశారు.
Mar 13, 2023, 10:32 am IST

#NaatuNaatu పాట ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న మొదటి భారతీయ, ఆసియా పాటగా చరిత్ర సృష్టించింది. కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, రాజమౌళి, జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
Mar 13, 2023, 10:26 am IST

నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఇది భారతదేశానికి గర్వకారణమైన, చారిత్రాత్మకమైన క్షణమని చెప్పారు. #NaatuNaatu చివరకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అకాడమీ అవార్డును గెలుచుకోవడం ప్రపంచ వేదికపై తెలుగు కీర్తి చాటి చెప్పిందన్నారు.
Mar 13, 2023, 10:22 am IST

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో #RRR లోని నాటు నాటు గీతం ఆస్కార్ అందుకోవటం అభినందనీయమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు శ్రీ కీరవాణి, గాయకులు రాహుల్, కాలభైరవ, దర్శకుడు రాజమౌళి, నటులు ఎన్టీఆర్, శ్రీ రాంచరణ్ ప్రతిభ ద్వారా తెలుగు పాటకు ప్రపంచ వేదిక గౌరవాన్నివ్వటం ఆనందదాయకమన్నారు.
Mar 13, 2023, 10:16 am IST

నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం పట్ల సీఎం జగన్ ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు జెండా రెపరెపలాడుతోందని చెప్పారు. మన జానపద వారసత్వాన్ని ఎంతో అందంగా జరుపుకునే తెలుగు పాట పట్ల తాను గర్వపడుతున్నానని చెప్పారు. ఎస్ఎస్ రాజమౌళి, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవారణికి అభినందనలు తెలిపారు.
Mar 13, 2023, 10:13 am IST

నాటు నాటు పాటుకు ఆస్కార్ అవార్డ్ రావడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కీరవాణి, చంద్రబోస్, రాజమౌలి, రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ కు అభినందనలు తెలిపారు.
Mar 13, 2023, 10:08 am IST

RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం ప్రధాన మంత్రి మోడీ ఆనందం వ్యక్తం చేశారు. ‘నాటు నాటు’కి ప్రపంచవ్యాప్త ఆదరణ ఉందన్నారు. కీరవాణి, చంద్రబోస్ తో పాటు RRR టీంకు అభినందనలు తెలిపారు.
Mar 13, 2023, 10:04 am IST

రచయత చంద్రబోస్ స్వగ్రామం భూపాలపల్లి జిల్లా చల్లరేగిలో బాణాసంచ పేల్చి సంబరాలు చేసుకుంటున్న జనం.
Mar 13, 2023, 10:04 am IST

నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ రావడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. RRR మూవీ టీం రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, జూ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాహుల్ సిప్లిగంజ్ కు అభినందనలు తెలిపారు.
Mar 13, 2023, 10:01 am IST

టీటీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు RRR టీమ్ కు అభినందనలు తెలిపారు. రాజమౌళి, కీరవాణి, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవను ప్రత్యేకంగా అభినందించారు. ఆస్కార్స్‌లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా అకాడమీ అవార్డును ‘నాటు నాటు’ గెలుచుకోవడం భారతీయ సినిమాకు అత్యుత్తమ క్షణమన్నారు.
Mar 13, 2023, 9:55 am IST

ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్.భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ వేదికపై పురస్కారాన్ని స్వీకరించిన ఆర్ఆర్ఆర్ చిత్ర సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి , గీత రచయిత చంద్రబోస్ హృదయపూర్వక అభినందించిన పవన్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+