వాట్సాప్ ద్వారా ఒక్క మెసేజ్ తో రూ.10 లక్షల లోన్
ప్రస్తుత రోజుల్లో పెద్ద పెద్ద సంస్థలన్నీ తమ సేవల్ని వాట్సాప్ రూపంలో కూడా అందిస్తున్నాయి. అందులో బ్యాంకులు కూడా ఉన్నాయి. వాట్సాప్ అకౌంట్‌తో బిల్లులు కూడా చెల్లించే సదుపాయం వచ్చింది. వాట్సాప్ ద్వారా ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ లోన్ సదుపాయాన్ని కల్పిస్తోంది. దీని ద్వారా రూ.10 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా ఇలాంటి సేవలందించే మొదటి సంస్థగా IIFL రికార్డు సృష్టించింది.
భారతదేశంలో సుమారు 45 కోట్ల మంది కంటే ఎక్కువగా వాట్సాప్ వినియోగదారులున్నారు. ఏ సమయంలోనైనా ఈ అవకాశం అందుబాటులో ఉంది. KYC, బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ వంటివి మనం ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. రుణం తీసుకోవాలనుకునేవారు 90197 02184 నంబర్‌కు హాయ్ అని వాట్సాప్ నుంచి మెసేజ్ పంపించాలి. కంపెనీ అడిగిన కొన్ని ప్రాథమిక వివరాలు ఇవ్వాలి. దేశంలోని అతిపెద్ద ఫైనాన్సింగ్ కంపెనీల్లో ఒకటైన ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ ఇంటి రుణాలు, వ్యాపార రుణాలు, మైక్రో ఫైనాన్స్ వంటివాటిని అందిస్తోంది.

IIFL ఫైనాన్స్ లక్ష MSME క్రెడిట్ విచారణలు నిర్వహిస్తోంది. దాదాపుగా అందరికీ అందుబాటులో ఉన్న ఫైనాన్సింగ్ సంస్థ కావడంతో ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించేందుకు సులువుగా రుణం పొందేలా ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. చిన్న వ్యాపారాలపై దృష్టి పెడుతున్నట్లు కంపెనీ బిజినెస్ హెడ్ భరత్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. ఈ లోన్ అందరికీ అందిస్తారా? లేదంటే పరిమితంగా అందిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. వాట్సాప్ ద్వారా వినియోగదారులందించే సమాచారాన్ని బట్టి ఈ రుణం అర్హత ఆధారపడివుంటుంది.












Click it and Unblock the Notifications