శబరిమల నకిలీ క్యూ పాస్‌లు- రూ.5 వేలకు విక్రయం- మూడు రాష్ట్రాల్లో దందా
ప్రస్తుతం కరోనా పరిస్ధితుల కారణంగా శబరిమల దర్శనాలకు ఏర్పడిన రద్దీ ఆపరేటర్లకు వరంగా మారింది. రద్దీని సొమ్ముచేసుకుంటూ దర్శనాల క్యూ కోసం ఇచ్చే పాస్‌ల నకిలీలను తయారు చేసి రూ.5 వేల చొప్పున విక్రయిస్తున్నారు. తెలంగాణ, తమిళనాడు, కర్నాటకల్లో సాగుతున్న ఈ ఆపరేటర్ల దందాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శబరిమల దర్శనాల కోసం ఏర్పడిన పాస్‌ల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఆపరేటర్లు ఐదు వేల రూపాయల చొప్పున వసూలు చేస్తూ హైదరాబాద్‌లో నకిలీ వర్చువల్ పాస్‌లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వ్యాప్తంగా ఈ రాకెట్ పనిచేస్తున్నట్లు తాజా వివరాలను బట్టి తెలుస్తోంది. ఐదు వేలు చెల్లిస్తే చాలు మొబైల్ ఫోన్ ద్వారా శబరిమల యాత్రికులకు నకిలీ వర్చువల్ క్యూ పాస్‌ను అందిస్తున్నారు. వాస్తవానికి ప్రస్తుతం మండల దీక్షల సీజన్ కోసం పది రోజుల ముందే పాస్‌లు అయిపోయాయి. 44 వేల పాస్‌లు అందుబాటులో ఉంచగా.. 12 గంటల్లోనే ఇవి అమ్ముడయ్యాయి.

హైదరాబాద్‌లో గత వారం ఓ నలుగురు భక్తులు ఈ ఆపరేటర్ల నుంచి నాలుగు నకిలీ పాస్‌లను రూ.1250 చొప్పున కొనుగోలు చేయగా.. రద్దీ పెరిగిందన్న కారణంతో ఒక్కొక్కరూ మరో రూ.2750 చొప్పన ఇవ్వాలని వారికి ఆపరేటర్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఇదే కోవలో కర్నాటకకు చెందిన 8 మంది భక్తుల బృందం నీలక్కల్ వెళ్లగా అక్కడ వారు తెచ్చినవి ఫేస్ పాసులుగా తేలడంతో వెనక్కి పంపారు. సన్నిధానం వద్ద గల అఖిల భారత అయ్యప్ప భక్తుల సేవా సంఘానికి వర్చువల్ పాస్‌ల రేటెంతో చెప్పాలంటూ వందలాది ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అలాగే వర్చువల్ పాస్‌ల అమ్మకం హక్కులు ఎవరికైనా ఇచ్చారా అన్న ఎంక్వైరీలు కూడా వస్తున్నాయి.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..












Click it and Unblock the Notifications