ఆలస్యం: 3గం.లుగా విమానాశ్రయంలో సచిన్ వెయిటింగ్
హైదరాబాద్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మూడు గంటలుగా హైదరాబాదు విమానాశ్రయంలో ఎదురు చూస్తున్నారు. విమానం రాక ఆలస్యం కావడంతో సచిన్ విమానాశ్రయంలోనే గంటల కొద్ది నిరీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. సచిన్‌తో పాటు ప్రయాణీకులు కూడా నిరీక్షిస్తున్నారు.
సాంకేతిక కారణాలతో సచిన్ ముంబైకి వెళ్లవలసిన స్పైస్ జెట్ విమానం ఆలస్యంగా వస్తుంది. ఈ కారణంగా సచిన్ విమానాశ్రయంలో నిరీక్షిస్తున్నారు.

కాగా అంతకుముందు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ హైదరాబాదులో సందడి చేశారు. ఓ కార్యక్రమం నిమిత్తం సచిన్ హైదరాబాదుకు వచ్చారు. ఆయన ప్యారడైజ్ హోటల్‌లో ఫలహారం తిని, చాయ్ తాగారు. ప్యారడైజ్ హోటల్ నుండి సచిన్ బయటకు వస్తుండగా.. భారీగా అభిమానులు చేరి అతనితో కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు.
సచిన్‌ను చూసేందుకు వచ్చిన అభిమానులతో ప్యారడైజ్ ప్రాంతం నిండిపోయింది. అభిమానులకు సచిన్ టెండుల్కర్ అభివాదం తెలిపారు. సచిన్ టెండుల్కర్ ఓ ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. భారీగా గుమికూడిన అభిమానులతో పాటు, పోలీసులు కూడా తమ సెల్‌ఫోన్‌లలో సచిన్ టెండుల్కర్ చిత్రాన్ని బందించేందుకు పోటీ పడ్డారు.












Click it and Unblock the Notifications