Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేప్ చేసి, వీడియో తీశాడు: ఆప్ మాజీ మంత్రిపై ఫిర్యాదు, అరెస్ట్

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత సందీప్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడని, తనపై అత్యాచారానికి పాల్పడి ఆ వీడియోలను బయపెట్టి తన పరువు తీశాడని బాధిత మహిళ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సందీప్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇద్దరు మహిళలతో సందీప్ కుమార్ రాసలీలలు నెరుపుతున్న వీడియో సీడీలు వెలుగు చూడటంతో ఆయనను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంత్రి పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. పోలీసులు సందీప్ కుమార్ ను అదుపులోకి తీసుకుని, లైంగికదాడి అభియోగాలు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బాధిత మహిళ పోలీసులకు తన వాంగ్మాలం ఇచ్చింది.

'11 నెలల కిందట నేను సందీప్‌కుమార్‌ను మార్కెట్‌లో కలిశాను. నాకు రేషన్‌ కార్డు ఇప్పించేందుకు సహాయం చేయమని కోరాను. నాకు సహాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పత్రాలు తీసుకొని ఒంటరిగా తన కార్యాలయానికి రావాలని సూచించారు. ఆ తర్వాత నన్ను తన ఇంటికి పిలిచారు. ఇంటికి వెళ్లాక ఓ గదిలో వేచి ఉండమని చెప్పారు. ఆ తర్వాత నాకు మత్తుపదార్థాలు కలిపిని పానీయాన్ని ఇచ్చారు. అనంతరం ఏం జరిగిందో నాకు తెలియదు' అని బాధితురాలు పోలీసులకు వివరించింది.

తనపై సందీప్‌కుమార్‌ అత్యాచారం జరిపారని, మర్నాడు ఉదయం తనను ఇంటినుంచి పంపించాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
కాగా, 'బాధితురాలిని సందీప్‌ వీడియో తీస్తున్నాడనే విషయం ఆమెకు తెలియదు. మత్తులో ఉన్న ఆమెకు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. ఆమెను ట్రాప్‌ చేసి అతను వాడుకున్నాడు' అని పోలీసు అధికారులు తెలిపారు.

Sacked AAP Minister Arrested In Delhi After Woman Files Rape Case

ఇలా ఎందుకు చేశావని ఆమె మర్నాడు ఉదయం సందీప్‌ను నిలదీసిందని, ఇలా చేయడం వల్ల తన పెళ్లిపై ప్రభావం పడే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేసిందని వారు చెప్పారు. అంతేగాక, 'రేషన్‌ కార్డు కావాలంటే నువ్వు లొంగిపోక తప్పదు అని సందీప్‌ చెప్పాడు. నీ పెళ్లి దెబ్బతీనకుండా ఉండాలంటే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకు అని ఆమెను బెదిరించాడు' అని పోలీసులు వివరించారు.

తనను మోసం చేసిన సందీప్‌ చివరకు రేషన్‌ కార్డు కూడా ఇప్పించలేదని, అవమానభారంతో తాము మరో ఇంటికి మారామని బాధితురాలు తెలిపింది. 'నేను పేద మహిళను. వివాహితను. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతనికి వ్యతిరేకంగా పోరాడే వనరులు నా వద్ద లేవు. బహిరంగంగా వీడియో లీక్‌ చేసి అతను నా పరువుకు భంగం కలిగించాడు. నా పరువుకు భంగం కలిగించి, తన జీవితాన్ని నాశనం చేశారని, ఆయనను కఠినంగా శిక్షించాలి'అని బాధిత మహిళ పోలీసులను కోరింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+