సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు ఏమైంది?
Sadhguru Jaggi Vasudev: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్.. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. కొద్దిరోజుల కిందటే ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఆయన ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్, రిటైర్డ్ లెప్టినెంట్ జనరల్ బిపిన్ సూరి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. నాలుగు వారాలుగా ఆయన తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారని, ఆ నొప్పితోనే తమిళనాడులోని కోయంబత్తూరులో మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారని తెలిపారు.

నొప్పి మరింత తీవ్రం కావడంతో ఈ నెల 15వ తేదీన ఢిల్లీ ఇంద్రప్రస్థలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని వివరించారు. సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. సబ్- డ్యూరల్ హెమటోమాతో జగ్గీ వాసుదేవ్ బాధపడుతున్నట్లు గుర్తించారు డాక్టర్లు. అప్పటికప్పుడు ఆయనకు ఎంఆర్ఐ స్కాన్ నిర్వహించారు.
మెదడులో బ్లీడింగ్ జరుగుతున్నట్లు రిపోర్టుల్లో తేలింది. 3 నుంచి 4 నాలుగువారాలుగా తీవ్రస్థాయిలో బ్లీడింగ్ అవుతున్నట్లు నిర్ధారించారు. దీనితో ఆయనను అప్పటికప్పుడు ఆసుపత్రిలో అడ్మిట్ కావాలంటూ ఆదేశించారు. ఇండియాటుడే కాన్‌క్లేవ్‌కు హాజరు కావాల్సి ఉన్నందున పెయిన్ కిల్లర్స్ తీసుకుని అందులో పాల్గొన్నారు.
17వ తేదీన జగ్గీ వాసుదేవ్ అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయనకు సీటీ స్కాన్ తీయగా.. మెదడులో ఒకవైపున వాపు ఉన్నట్లు తేలింది. దీనితో ఆయనకు డాక్టర్ వినీత్ సూరి, డాక్టర్ ప్రణవ్ కుమార్, డాక్టర్ సుధీర్ త్యాగి, డాక్టర్ ఎస్ ఛటర్జీతో కూడా మెడికల్ టీమ్ బ్రెయిన్ సర్జరీ చేసింది. బ్లీడింగ్‌ను నివారించింది. సర్జరీ తరువాత కొన్ని గంటలపాటు వెంటిలేటర్‌పై ఉన్నారని తెలిపింది.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొంది. న్యురాలజిస్టులు, న్యూరోసర్జన్లు, ఐసీయూ క్లినిషియన్స్, నర్సులు, ఇతర ఓటీ స్టాఫ్ పర్యవేక్షణలో ఉన్నారని, మాట్లాడగలుగుతున్నారని వివరించింది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications