Girlfriend: ప్రియురాలు ఇస్లాం మతం స్వీకరించలేదని ?, అపార్ట్ మెంట్ పైనుంచి తోసేసిన శాడిస్టు !

లక్నో: పక్కపక్క ఇళ్లల్లో నివాసం ఉంటున్న యువతి, యువకుడికి ముందు నుంచి పరిచయం ఉంది. కొంతకాలం క్రితం ఇద్దరూ ప్రేమించుకున్నారు. యువతి హిందూ, యువకుడు ముస్లీం. నువ్వు మతం మార్చుకోవాలని, నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని ప్రియుడు అతని ప్రియురాలికి చెప్పాడు. ఇస్లాం మతం స్వీకరించడానికి ఆమె నిరాకరించింది. ఇదే విషయంలో ప్రేమికుల మద్య గొడవలు జరిగాయి. ప్రియురాలు బ్యూటీపార్లల్ కు వెళ్లకూడాదని ప్రియుడు షరతులు పెట్టాడు. ఇస్లాం మతం స్వీరించే విషయంలో గొడవ జరగడంతో సహనం కోల్పోయిన ప్రియుడు అతని ప్రియురాలిని అపార్ట్ మెంట్ పైనుంచి కిందకుతోసి చంపేసి అతని పగ తీర్చుకుని ఎస్కేప్ అయ్యాడు.

పక్కపక్క ఇళ్లల్లో నివాసం

పక్కపక్క ఇళ్లల్లో నివాసం

ఉత్తరపరదేశ్ రాజధాని లక్నోలోని దుబగ్గా పోలీస్ స్టేషన్ పరిధిలోని బసంత్ కుంజ్ సెక్టార్ హెచ్ లో నిధి గుప్తా (19) అనే యువతి నివాసం ఉంటున్నది. ఈమె ఇంటి పక్కనే మోహమ్మద్ సోఫియాన్ అలియాస్ మోహమ్మద్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. పక్కపక్క ఇళ్లల్లో నివాసం ఉంటున్న నిధి గుప్తాకు, మోహమ్మద్ కు ముందు నుంచి పరిచయం ఉంది.

హ్యాపీగా ఎంజాయ్ చేసిన లవర్స్

హ్యాపీగా ఎంజాయ్ చేసిన లవర్స్

కొంతకాలం క్రితం నిధి గుప్తా, మోహమ్మద్ ప్రేమించుకున్నారు. నిధి గుప్తా హిందూ, మోహమ్మద్ ముస్లీం అయినా వారు పెద్దగా పట్టించుకోలేదు. అందరి ప్రేమికుల్లా నిధి గుప్తా, మోహమ్మద్ హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేశారు. అయితే మోహమ్మద్ సోఫియాన్ లవ్ జీహాద్ స్కెచ్ ను అతని ప్రియురాలు నిధి గుప్తా పసిగట్టలేకపోయింది.

 ఇస్లాం మతం స్వీకరించాలని డిమాండ్

ఇస్లాం మతం స్వీకరించాలని డిమాండ్


నువ్వు మతం మార్చుకోవాలని, నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని నిధి గుప్తాకు ఆమె ప్రియుడు మోహమ్మద్ చెప్పాడు. ప్రియుడు మోహమ్మద్ మాటలతో నిధి గుప్తా షాక్ అయ్యింది. నేను ఇస్లాం మతం స్వీకరించను అని నిధి గుప్తా చెప్పింది. ఇస్లాం మతం స్వీకరించే విషయంలో ప్రేమికులు మోహమ్మద్, నిధి గుప్తాల మద్య గొడవలు జరిగాయి.

అపార్ట్ మెంట్ నాలుగో అంతస్తు మీదనుంచి ?

అపార్ట్ మెంట్ నాలుగో అంతస్తు మీదనుంచి ?


బ్యూటీషియన్ కావాలని ఆశపడిన ప్రియురాలు నిధి గుప్తా ఆమె బ్యూటీపార్లల్ కు వెళ్లకూడాదని, ఆపని చెయ్యడానికి వీలులేదని మోహమ్మద్ సోఫియాన్ షరతులు పెట్టాడు. ప్రియుడు మోహమ్మద్ ను నిధి గుప్తా దూరం పెట్టడానికి ప్రయత్నించింది. ఇస్లాం మతం స్వీరించే విషయంలో గొడవ జరగడంతో సహనం కోల్పోయిన మోహమ్మద్ అతని ప్రియురాలు నిధి గుప్తాను అపార్ట్ మెంట్ నాలుగో అంతస్తు మీదకు లాక్కొని వెళ్లి అక్కడి నుంచి ఆమెను కిందకుతోసేశాడు.

యువతి ప్రాణం పోయింది

యువతి ప్రాణం పోయింది

అపార్ట్ మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందపడిన నిధి గుప్తా ప్రాణాలతోనే ఉండటంతో ఆమెను వెంటనే లక్నోలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై నిధి గుప్తా చనిపోయిందని లక్నో పశ్చిమ విభాగం డీసీపీ సీఎన్ సిన్హా మీడియాకు చెప్పారు. నిధి గుప్తా తల్లి ఫిర్యాదు చేశారని, మోహమ్మద్ మీద హత్య, బలవంతంగా మతం మార్చడానికి ప్రయత్నించాడని కేసు నమోదు చేశామని. పరారైన నిందితుడి కోసం గాలిస్తున్నామని లక్నో పశ్చిమ విభాగం డీసీపీ సీఎన్ సిన్హా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+