
Sadist: భార్య మూతి, ముక్కు ఒక్కటి చేసి ఫేస్ బుక్ లో పోస్టు, భార్య కూడా ఓ వీడియో పెట్టింది !
కొచ్చి/తిరువనంతపురం: ప్రేమికులు సంతోషంగా తిరిగారు. పెళ్లికాకముందు ప్రియురాలు ఏమి చెప్పినా కాదనకుండా తీసివ్వడం, ఆమెను పువ్వల్లో పెట్టుకుని చూసుకోవడం చేశాడు. పెద్దలను ఎదిరించిన ప్రేమికులు లవ్ మ్యారేజ్ చేరుకుని సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఉద్యోగం చేస్తోంది. బయటకు వెళ్లి ఉద్యోగం చేస్తున్న భార్య మీద ఆమె భర్తకు విపరీతమైన అనుమానం వచ్చింది. ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్లిన భార్యను చీతకబాదేసిన భర్త ఆ సమయంలో వీడియో తీస్తూ నేను నా భార్యను చితకబాదేసి ముక్కు ముఖం ఒక్కటి చేశాను, నేను మంచి పని చేశాను అని అనుకుంటున్నా, మీరు ఏమని అనుకుంటున్నారో ఆ విషయం కామెంట్ చెయ్యండి అంటూ మాట్లాడి ఆ వీడియోను ఫేస్ బుక్ లో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. భార్య కూడా ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో అసలు సినిమా మొదలైయ్యింది.
Honour
killing:
కులపిచ్చి,
మైనర్
కూతురు,
బాయ్
ఫ్రెండ్
ను
చంపేసి
?,
కృష్ణా
నదిలో
కలిపేసి
?

ప్రియురాలు చెప్పింది వేదం
కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని మలయంకీపు ప్రాంతంలో దిలీప్ (27) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఆరు సంవత్సరాల క్రితం దిలీప్ నదియా అలియాస్ అదియా అనే యువతిని ప్రేమించాడు. ప్రేమికులు దిలీప్, నదియా చాలా సంతోషంగా తిరిగారు. పెళ్లికాకముందు ప్రియురాలు నదియా ఏమి చెప్పినా దిలీప్ ఏమాత్రం కాదనకుండా తీసిచ్చాడు.

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న లవర్స్
పెళ్లికాకముందు దిలీప్ అతని ప్రియురాలు నదియాను పువ్వల్లో పెట్టుకుని చూసుకున్నాడు. పెద్దలను ఎదిరించిన ప్రేమికులు దిలీప్, నదియా ఐదు సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేరుకుని సంతోషంగా కాపురం చేశారు. పెద్దలకు దూరంగా తిరువనంతపురంలో నివాసం ఉంటున్న దిలీప్, నదియా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

భర్త లిక్కర్ బాధితుడు.... ఉద్యోగం చేస్తున్న భార్య
పెళ్లి జరిగిన రెండు సంవత్సరాల తరువాత దిలీప్ మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. నిత్యం మద్యం సేవిస్తున్నదిలీప్ ను ఉద్యోగంలో నుంచి తీసేశారు. పిల్లలను పోషించడానికి కష్టం కావడంతో నదియా ఓ సూపర్ మార్కెట్ లో ఉద్యోగంలో చేరింది. ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లి వస్తున్న నదియా జీతం తీసుకుని భర్త దిలీప్, ఇద్దరు పిల్లలను పోషిస్తున్నది.

భార్య మీద అనుమానంతో శాడిస్టు ఏం చేశాడంటే ?
బయటకు వెళ్లి ఉద్యోగం చేస్తున్న భార్య నదియా మీద ఆమె భర్త దిలీప్ విపరీతమైన అనుమానం వచ్చింది. భార్య నదియా అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే ఉద్యోగం చేస్తున్నానని చెప్పి రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తోందని దిలీప్ రగిలిపోయాడు. రాత్రి పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లిన దిలీప్ అతని భార్యను చితకబాదేసి ఓ వీడియో తీశాడు.

ఫేస్ బుక్ లో భార్య వీడియో వైరల్
నేను నా భార్య నదియాను చితకబాదేసి ముక్కు ముఖం ఒక్కటి చేశాను, నేను మంచి పని చేశాను అని అనుకుంటున్నా, మీరు ఏమని అనుకుంటున్నారో ఆ విషయం కామెంట్ చెయ్యండి అంటూ మాట్లాడిన దిలీప్ మొబైల్ లో తీసి ఫేస్ బుక్ లో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. వీడియోలో నదియా ముఖం మీద తీవ్రగాయాలు కావడంతో వైరల్ అయ్యింది.

భార్య దెబ్బకు భర్తకు దిగిపోయింది
ముఖం మీద తీవ్రగాయాలు కావడంతో నదియా కూడా ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. నా భర్త డబ్బు సంపాధించకుండా నన్ను, నా పిల్లలను పస్తు పెడుతున్నాడని, ఉద్యోగం చేస్తున్న తన మీద ఇలా దాడి చేస్తున్నాడని వీడియో తీసి ఫేస్ బుక్ లో విపరీతంగా వైరల్ అయ్యింది. నదియా వీడియో చూసిన నెటిజన్లు మండిపడ్డారు. వీడియో ఆధారంగా పోలీసులు దిలీప్ ను అరెస్టు చేసి బెండ్ తీసి జైలుకు పంపించారు.