Sadist lover: గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఒంటరిగా ఉందని వెళ్లి ఏం చేశాడంటే ?, అక్కడే గొంతు కోసుకుని !
బెంగళూరు/రామనగర్: యువతి, యువకుడు ఒకే షోరూమ్ లో ఉద్యోగం చేసే సమయంలో పరిచయం అయ్యింది. ఏడాదిపాటు ఇద్దరూ స్నేహితులుగా ఉన్నారు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని యువకుడు ఆమెకు చెప్పాడు. అయితే యువకుడిని ఆ యువతి ప్రేమించలేదు. మూడు సంవత్సరాల పాటు తనను ప్రేమించాలని ఆ యువకుడు ఆమె మీద ఒత్తిడి చేశాడు. యువకుడి టార్చర్ తట్టుకోలేక ఆమె ఆ షోరూమ్ లో ఉద్యోగం మానేసి వేరే చోట ఉద్యోగంలో చేరింది. యువతి ఇంట్లో ఉందని తెలుసుకున్న యువకుడు ఆమె ఇంటికి వెళ్లి పెద్ద గొడవ చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతి ఏమీ చెయ్యలేకపోయింది. ఆ సందర్బంలో వన్ సైడ్ లవర్ అతని ప్రియురాలిని కత్తితో ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు. తరువాత అతను కూడా గొంతు కోసుకోవడం కలకలం రేపింది.

మొబైల్ షోరూమ్
కర్ణాటకలోని రామనగర్ లో ప్రముఖ కంపెనీ షోరూమ్ ఉంది. రామనగరలో నివాసం ఉంటున్న వెంకటేష్ కొన్ని సంవత్సరాల నుంచి ఇదే మొబైల్ షోరూమ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. రామనగర జిల్లాలోని చెన్నపట్టణలోని కోటే లేఔట్ లోని వరదరాజస్వామి దేవాలయం వీధిలో నివాసం ఉంటున్న మేఘనా కూడా ఆ మొబైల్ షోరూమ్ లో మూడు సంవత్సరాల క్రితం ఉద్యోగంలో చేరింది.

ఐలవ్ యూ
వెంకటేష్, మేఘనా ఒకే షోరూమ్ లో ఉద్యోగం చేస్తుండటంతో ఇద్దరికి పరిచయం అయ్యింది. ఏడాదిపాటు వెంకటేష్, మేఘనా ఇద్దరూ స్నేహితులుగా ఉన్నారు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని వెంకటేష్ మేఘనాకు చెప్పాడు. అయితే నువ్వు నాకు స్నేహితుడు మాత్రమే, నేను నిన్ను ప్రేమిచండం లేదని మేఘనా అతనికి చెప్పింది.

ఉద్యోగం మానేసిన యువతి
వెంకటేష్ ను మాత్రం మేఘనా ప్రేమించలేదు. మూడు సంవత్సరాల పాటు తనను ప్రేమించాలని వెంకటేష్ మేఘనా మీద ఒత్తిడి చేశాడు. వెంకటేష్ టార్చర్ తట్టుకోలేక మేఘనా ఇదే సంవత్సరంలో మొబైల్ షోరూమ్ లో ఉద్యోగం మానేసి బెంగళూరులోని జ్యువెలరీ షోరూమ్ లో ఉద్యోగంలో చేరింది. బెంగళూరులోనే ఇంతకాలం మేఘనా ఉద్యోగం చేసింది.

ఇంట్లోదూరి రెచ్చిపోయిన శాడిస్టు లవర్
మంగళవారం మేఘనా ఇంట్లో ఉందని తెలుసుకున్న వెంకటేష్ నేరుగా చెన్నపట్టణలోని ఆమె ఇంటికి వెళ్లి పెద్ద గొడవ చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మేఘనా ఇంట్లో దూరిన వెంకటేష్ ను ఏమీ చెయ్యలేక, ఎదరించలేకపోయింది. ఆ సందర్బంలో వన్ సైడ్ లవర్ వెంకటేష్ ఇంట్లో ఒంటరిగా ఉన్న మేఘనా కడుపు, వీవు, ఛాతీమీద కత్తితో ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు. తరువాత వెంకటేష్ కూడా గొంతు కోసుకున్నాడు

ఐసీయూలో శాడిస్టు
వెంకటేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో మండ్య జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మేఘనాను బెంగళూరుకు తరలించి చికిత్స అందిస్తున్నామని చెన్నపట్టణ పోలీసు అధికారులు తెలిపారు. వన్ సైడ్ లవర్ పట్టపగలు వన్ సైడ్ ప్రియురాలి మీద హత్యాయత్నం చేసి అతను కూడా గొంతు కోసుకోవడం చెన్నపట్టణలో కలకలం రేపింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications