Sadist: కాలేజ్ నిలిపేశాడు, మహిళను మొక్కజొన్న తోటలో ఏం చేశాడంటే ?

చెన్నై/సేలం: తమిళనాడులోని సేలం జిల్లాలోని వీరకనూరు సమీపంలో బగడప్పాడి ప్రాంతంలో నివాసం ఉంటున్న మహిళ ఆమె బంధువుల ఇంటికి బయలుదేరింది. రోడ్డు పక్కన ఆమె నడుచుకుంటూ వెలుతున్నది. మహిళ ఒంటరిగా వెలుతున్న విషయం గమనించిన యువకుడు ఆమెను సమీపంలోని మొక్కజొన్న తోటలోకి లాక్కొని వెళ్లాడు.

మహిళ మీద 22 ఏళ్ల యువకుడు అత్యాచారం చెయ్యడానికి విఫలయత్నం చేశాడు. మహిళ గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల పొలాల్లో పని చేస్తున్న రైతులు. కూలీలు మొక్కజొన్న తోటవైపు పరుగు తీశారు. స్థానికులు వస్తున్నారని గమనించిన కామాంధుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. గాయాలైన 60 ఏళ్ల మహిళను సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Sadist: Young man tried to rape an old woman near Salem in Tamil Nadu.

మహిళ ఇచ్చిన సమాచారం మేరకు వీరకనూరు ప్రాంతంలో నివాసం ఉంటు్న శ్రీధర్ (22) అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. 60 ఏళ్ల మహిళ మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించానని శ్రీధర్ అంగీకరించాడని పోలీసులు చెప్పారు. గత సంవత్సరం వరకు శ్రీధర్ సేలంలోని ఒకకాలేజ్ లో చదువేవాడు.

చదువు మద్యలో ఆపేసిన శ్రీధర్ ఆ ప్రాంతంలో ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడని పోలీసులు అన్నారు. చెడుఅలవాట్లకు బానిస అయిన శ్రీధర్ స్నేహితులతో కలిసి ఎక్కువగా బయట తిరుగుతున్నాడని పోలీసులు చెప్పారు. 22 ఏళ్ల యువకుడు 60 ఏళ్ల మహిళ మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+