డెత్ థ్రెట్ నోట్: సల్మాన్ ఖాన్‌ చేతికి గన్: ఆ సింగర్ మర్డర్ తరువాత..కీలక పరిణామం

ముంబై: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు గన్ లైసెన్స్‌ మంజూరు అయింది. హతమారుస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు లేఖను అందుకున్న నేపథ్యంలో ముంబై పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు ఆయుధ లైసెన్స్‌ను మంజూరు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, ఆయుధాన్ని వినియోగించడానికి లైసెన్స్‌ కావాలంటూ ఇటీవలే ఆయన ముంబై పోలీసులను కలిశారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిద్ధు మూసేవాలా హత్యోదంతం అనంతరం బాలీవుడ్ సెలెబ్రిటీలకు బెదిరింపు లేఖలు అందిన విషయం తెలిసిందే. ప్రత్యేకించి సల్మాన్ ఖాన్‌ టార్గెట్ అయ్యారు. సెల‌ెబ్రిటీల‌ను గ్యాంగ్‌స్ట‌ర్లు లక్ష్యంగా చేసుకున్నారు. స‌ల్మాన్‌ ఖాన్‌ను హత మార్చడం త‌న‌ ల‌క్ష్య‌మంటూ లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగ్ స్ట‌ర్ ప్ర‌క‌టించుకున్నాడు కూడా.

Salman Khan granted gun license after the actor receives seriousness of death threat letter

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో న‌ల్ల‌జింక‌ల‌ను వేటాడిన నేపథ్యంలో ఆయనపై పగ తీర్చుకుంటానని అతను హెచ్చరించాడు. లేఖ కూడా రాశాడు. ఆయన తండ్రి సలీమ్ ఖాన్ పేరు సైతం అందులో పొందుపరిచాడు. అదే సమయంలో సిద్ధు మూసేవాలా హత్య చోటు చేసుకోవడం, అందులో ప్రధాన నిందితుడిగా లారెన్స్ బిష్ణోయ్ పేరు వెలుగులోకి రావడం మరింత కలవరపరిచింది. దీనితో సల్మాన్ ఖాన్ గన్ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవలే ఆయన ముంబై పోలీస్ కమిషనర్‌ వివేక్ ఫన్సల్కర్‌ను స్వయంగా కలుసుకున్నాడు.

దీనితో పాటు తాను రోజూ వినియోగించే ల్యాండ్ క్రూయిజ్ కారును అప్‌గ్రేడ్ చేసుకున్నాడు. దాన్ని బుల్లెట్ ప్రూఫ్‌గా బదలాయించుకున్నాడు. పాయింట్ బ్లాంక్ రేంజ్‌ నుంచి బుల్లెట్లు తగిలినా ధ్వంసం కాని విధంగా కారును అప్‌గ్రేడ్ చేశాడు. సిద్ధు మూసేవాలా కారులో ప్రయాణిస్తోన్న సమయంలోనే హత్య చేసిన నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ బెదిరింపు లేఖ నేపథ్యంలో- సల్మాన్ ఖాన్ నివాసానికి పోలీసులు భద్రత పెంచారు. ఇదివరకంటి కంటే మరింత కట్టుదిట్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+