పాకిస్థాన్ కు మద్దతుగా సల్మాన్ ఖాన్ సంచలన ట్వీట్.. బీజేపీ వార్నింగ్.. వెంటనే డిలీట్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో లెక్కలేనన్ని సార్లు వార్తల్లో నిలిచిన సల్మాన్ ఖాన్ తాజాగా మరోసారి తన క్యారెక్టర్ ను బయటపెట్టారు. భారత్- పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించారు. ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ సందర్భంగా దేవుడికి కృతజ్ఞతలు అంటూ పోస్టు పెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు అలుముకున్నాయి. అటు ఫ్యాన్స్ ఇటు బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో సల్లూ భాయ్ ఆ ట్వీట్ ను వెంటనే డిలీట్ చేశారు.

ఆపరేషన్ సిందూర్ ప్రారంభమై చాలా రోజులు అవుతున్నా ఎందుకు స్పందించలేదని.. ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ ఉన్నారని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పై స్పందించకుండా ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారని మండిపడ్డారు. దీంతో సల్మాన్ ఖాన్ వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణ బీజేపీ నేత మాధవీలత.. సల్మాన్ ఖాన్ పై ఘాటు విమర్శలు చేశారు. తీవ్రవాదులు లోపలే(భారత్ లోనే) ఉన్నారని.. ముందు వాళ్లను తరిమేయాలని ట్వీట్ చేశారు. మరికొంత మంది మాత్రం ఆ ట్వీట్ లో సల్మాన్ ఖాన్ తప్పేమీ లేదని అన్నారు. సీజ్ ఫైర్ ఒప్పందానికి దేవుడికి థ్యాంక్స్ చెప్పాడని.. పాకిస్థాన్ సీజ్ ఫైర్ ఉల్లంఘించిన నేపథ్యంలో ఆ ట్వీట్ ను సల్మాన్ ఖాన్ డిలీట్ చేశారని అంటున్నారు.
घर के अंदर छिपे पाकिस्तानी pic.twitter.com/doklnTo2ML
— Madhvi Latha (Modi ka Parivar) Support Zone (@madhvilatha_bjp) May 10, 2025
ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడిపైనా సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు. 'భూతల స్వర్గం కాశ్మీర్ నరకంగా మారుతోంది. అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. నా హృదయం వాళ్ల కుటుంబాల గురించి ఆలోచిస్తోంది. ఒక అమాయకుడిని చంపడం మొత్తం ప్రపంచాన్ని చంపడంతో సమానం' అని సల్మాన్ ఖాన్ పోస్టు చేశారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications