సమంత నువ్వు కేక, లెక్కల్లో వందకు వంద, మార్కుల్లోనూ తీసిపోని జాను...
టాపర్ ఎక్కడైనా టాపర్.. నటిగా, భార్యగా, కోడలి, తల్లిగానే కాదు.. చదవుల తల్లిగా నిలిచారు. ఇదంతా జానూ.. సమంత అక్కనేని గురించే. ఆమె పదో తరగతి మార్కుల లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిని ఆమె అభిమానులు షేర్ చేస్తూ.. కామెంట్లు పెడుతున్నారు.
సమంతా.. చెన్నై పల్లవరంలో గల సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో చదివారు. అయితే ఆమె పదో తరగతిలో ఇంగ్లీష్‌లో 90, మ్యాస్ 100, ఫీజిక్స్ 95, బొటానీ 84, చరిత్ర 91 మార్కులు సాధిందారు. అంటే సమంత చదువుల్లోనూ టాప్ స్టూడెంట్. దీనిపై ఆమె టీచర్ కూడా బాగా చదివే సమంత తమ ఆస్తి అని పేర్కొన్నారు. ఇక సమంత అభిమానులు ఊరుకుంటారా... తమ నటిని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
Ha ha this has surfaced again 😁❤️ Awww https://t.co/UMQlxH1dsX
— Samantha Akkineni (@Samanthaprabhu2) May 29, 2020

దీనిపై సమంతా కూడా స్పందించారు. ట్వీట్‌కు రీ ట్వీట్ చేస్తూ.. తవ్వకాల్లో మరోసారి తన మార్కుల జాబితా బయటపడిందా.. హాహాహా అంటూ నవ్వుతూ ఉన్న ఏమోజీ పోస్ట్ చేశారు. తెలుగులో ఏ మాయ చేశావోతో సమంతా లైమ్ లైట్ లోకి వచ్చారు. తర్వాత నాగ చైతన్యతో కలిసి మనం, ఆటోనగర్ సూర్య సినిమాలు చేశారు. వీరిద్దరూ ప్రేమించుకొని.. 2017లో హిందూ-క్రిస్టియన్ సంప్రదాయాల్లో పెళ్లి చేసుకున్నారు. తెలుగు, తమిళంలో పలు హిట్ సినిమాల్లో సమంత నటించారు.












Click it and Unblock the Notifications