కేంద్రానికి అడ్డం తిరిగిన కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు

న్యూఢిల్లీ: దేశంలో స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు లభించాలనే డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది. ఈ ప్రక్రియపై ఇవ్వాళ సుప్రీంకోర్టులో వాదనలు కూడా మొదలయ్యాయి. వాడివేడిగా వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో- స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధతను కల్పించాలని, దీనికి అధికారిక గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్ జోరుగా వినిపిస్తోంది.

ఈ విషయంపై పలువురు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. పలు పిటీషన్లను దాఖలు చేశారు. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టపరమైన గుర్తింపు, రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇదివరకే విచారణ చేపట్టింది. దీన్ని అయిదుమంది న్యాయమూర్తులు గల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.

 vivekagnihotri

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్లపై విచారణ కొనసాగిస్తోంది. ఈ తరహా వివాహాలను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది. వివాహం అనేది కుటుంబపరమైన అంశమని, అది సమాజంపైన ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది.

కేంద్రం చేసిన ఈ వ్యాఖ్యలపై తాజాగా బాలీవుడ్‌ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. కేంద్రం అభిప్రాయాలను తప్పుపట్టారు. స్వలింగ వివాహాల విషయంలో తాను కేంద్రం వాదనలతో ఏకీభవించట్లేదని వ్యాఖ్యానించారు. స్వలింగ వివాహం అనేది ఎట్టి పరిస్థితులోనూ నేరం కాదని, దీన్ని ఇతరత్రా కోణాలతో చూడాల్సిన అవసరం లేదని చెప్పారు. స్వలింగ వివాహాన్ని ఒక అవసరంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.

స్వలింగ వివాహాన్ని అర్బన్ ఎలిటిస్ట్‌గా భావించడం సరికాదని, అది మనుషులకు అవసరమని వివేక్ అగ్నిహోత్రి చెప్పారు. పట్టణాలు గ్రామాల ముఖాలను కూడా ఎప్పుడూ చూడని కొంతమంది ప్రభుత్వ పెద్దల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం సరికాదని తేల్చి చెప్పారు. స్వలింగ వివాహం అనేదాన్ని ఓ భావనగా చూడకూడదని, అవసరం అనే కోణంలో చూడాలని చెప్పారు. దాన్ని హక్కుగా అభివర్ణించారు.

ప్రగతిశీల, ఉదారవాద, సమ్మిళిత నాగరికతను అనుసరిస్తోన్న భారత్ వంటి ఓ దేశంలో స్వలింగ వివాహాన్ని తప్పుగా, నేరంగా పరిగణించకూడదని వివేక్ అగ్నిహోత్రి చెప్పుకొచ్చారు. దీన్ని ఓ సాధారణ, సామాన్య ప్రక్రియగానే చూడాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నేరంగా చూడకూడదని, దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+