బీహార్ నూతన సీఎం గా అనూహ్య ఎంపిక, నితీశ్ 'ఫిక్స్' - మోదీ మార్క్ నిర్ణయాలు..!!
బీహార్ నూతన సీఎం ఖరారయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ బీహార్ సీఎం గా రేపు రాజీనామా చేయనున్నారు. ఇదే సమయంలో బీజేపీ- జేడీయూ శాసనసభ్యుల సమావేశం ఏర్పాటు చేసారు. ఆ భేటీకి బీజేపీ పరిశీలకుడిగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరు కానున్నారు. బీహార్ కొత్త సీఎం ఖరారు వేళ.. నితీశ్ రాజకీయ భవిష్యత్ పైన బీజేపీ అధి నాయకత్వం స్పష్టత ఇచ్చింది. 2029 ఎన్నికలే లక్ష్యంగా మోదీ - షా ద్వయం పావులు కదుపుతున్నారు.
బీహార్ సీఎం నితీశ్ రేపు (మంగళవారం) రాజీనామా చేయనున్నారు. బీజేపీ నుంచి కొత్త సీఎం ను ఖరారు చేసారు. ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలో అధికారికంగా ఎంపిక చేయనున్నారు. ఇప్పటి కే కొత్త సీఎం పైన ప్రధాని మోదీ - అమిత్ షా ఒక నిర్ణయానికి వచ్చారు. అనేక తర్జన.. భర్జనల తరువాత బిహార్ నూతన సీఎంగా బీజేపీ నేత సామ్రాట్ చౌదరి పేరు వైపు మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. నితీష్ కుమార్ మంగళవారం, ఏప్రిల్ 14న ఉదయం 11 గంటలకు క్యాబినెట్ మీటింగ్ నిర్వహించబోతున్నారు. పాట్నాలో జరిగే ఈ సమావేశం అనంతరం ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేస్తారు. అనంతరం ఎన్‌డీయే లెజిస్లేటర్ల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఎన్‌డీయే నూతన లెజిస్లేచర్ పార్టీ నేతను ఎన్నుకుంటారు. ఆ నేత బిహార్ సీఎంగా ఎన్నికవుతారు. సామ్రాట్ చౌదరి బీజేపీలో సీనియర్ నేత. ప్రస్తుత బిహార్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. 2023లో బిహార్ బీజేపీ అధ్యక్షుడయ్యారు.

మోదీ - షా వ్యూహాత్మక నిర్ణయాలు
ఓబీసీలోని కొయేరి సామాజికవర్గానికి చెందిన సామ్రాట్ చౌదరినే బీజేపీ అధిష్టానం సీఎంగా ఎంపిక చేసిందని తెలుస్తోంది. ఇంతకాలం ఎన్‌డీయే కూటమిలో కీలకంగా ఉన్న జేడీయూ అధినేత నితీష్ కుమార్ సీఎంగా కొనసాగారు. ఆయన రాజ్యసభకు వెళ్తుండటంతో ఇప్పుడు రాష్ట్రానికి బీజేపీ తరఫున సీఎం పదవి చేపడుతారు. మంగళవారం జరిగే ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశానికి బీజేపీ పరిశీలకుడిగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 14న నితీష్ గవర్నర్‌కు రాజీనామా సమర్పిస్తే.. 15న సామ్రాట్ చౌదరి సీఎం పదవి చేపడతారు. నూతన సీఎం ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా.. ఎన్డీఏ పాలిన రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. కాగా.. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించనున్న నితీశ్ కు ఢిల్లీలో కేంద్ర మంత్రిగా.. భవిష్యత్ లో కీలక పదవి ఇచ్చేలా బీజేపీ నేతలు ఒప్పించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications