శామ్ సంగ్ కొత్త ఫోన్ గెలాక్సీ F54
శామ్ సంగ్ కంపెనీ గెలాక్సీ ఎఫ్ సిరీస్ లో కొత్తగా F54 ను విడుదల చేసింది. తాజాగా ఇది ఇండియన్ మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది. 5జీ నెటవర్క్ ను సపోర్టు చేసేలా దీన్ని రూపొందించారు. అత్యాధునిక ఫీచర్లతో దీన్ని మార్కెట్ లోకి తెచ్చారు. అడ్వాన్స్ డ్ ఫీచర్లతో సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 54 ను మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఎఫ్ సిరీస్ లో ఇది మిడ్ రేంజ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్. 108 ఎంపీ నో షేక్ కెమెరా దీని ప్రత్యేకత. ఈ ఫోన్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెర్జ్స్ అమొలెడ్ డిస్ ప్లే అమర్చారు.
నైటోగ్రఫీ, ఆస్ట్రోలాప్స్ గెలాక్సీ ఎఫ్ 54 స్మార్ట్ ఫోన్ లో ప్రత్యేక ఫీచర్లు. తక్కువ వెలుతురులో, నైట్ విజన్ లో నాణ్యమైన ఫొటోలు తీయవచ్చు. అలాగే రాత్రి సమయంలో ఆకాశాన్ని టైమ్ లాప్స్ వీడియోస్ తీయొచ్చు. ఇందులో 108 ఎంపీ ఐఓఎస్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 2 ఎంపీ మాక్రో లెన్స్ అమర్చారు. సెల్ఫీస్ కోసం, వీడియో కాల్స్ కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది.

అల్ట్రా హెచ్ డీ 4 కే వీడియో రికార్డింగ్ చేయొచ్చు. 6.7 అంగుళాల ఎస్ అమోలెడ్ ప్లస్ డిస్ ప్లే ఉంది. ఎక్సినాస్ 1380 5 ఎన్ఎం ప్రాసెసర్ అమర్చారు. ఇది 5 జీ నెట్ వర్క్ ను సపోర్ట్ చేస్తుంది. 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ని ఇచ్చారు. మీటియో బ్లూ, స్టార్ డస్ట్ సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ నుంచి కానీ, శామ్ సంగ్ అధికారిక వెబ్ సైట్ Samsung.com నుంచి, అలాగే కొన్ని ఎంపిక చేసిన రిటైల్ స్టోర్స్ నుంచి కొనొచ్చు. 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ తో లభించే ఈ ఫోన్ ధర రూ. 29,999 . ప్రారంభ ఆఫర్ గా రూ.2 వేల డిస్కౌంట్ తో రూ. 27,999కి ఇస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి దీన్ని ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications