బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Actress: మేడమ్ కు బెయిల్, డ్రగ్స్ కేసులో 140 రోజులు సెంట్రల్ జైలు, పగవాళ్లకు ఈ కష్టాలు వద్దు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయ్యి జైలుపాలైన స్యాండిల్ వుడ్ బ్యూటీక్వీన్, బహుబాష నటి రాగిణి అలియాస్ రాగిణి ద్వివేదికి బెయిల్ మంజూరు అయ్యింది. సుమారు 140 రోజుల పాటు జైలు జీవితం గడిపిని ఈ ముద్దుగుమ్మ జైలు నుంచి విడుదల అవుతోంది. బెంగళూరులోని ప్రత్యేక కోర్టులు, కర్ణాటక హైకోర్టు రాగిణికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించాయి. చివరికి సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేసిన రాగిణి చివరికి షరతులో బెయిల్ తీసుకుంది. రాగిణి బెయిల్ రావడంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఆమె అభిమానులు కొంచెం ఊపిరిపీల్చుకున్నారు.

friends: మీ అమ్మ సూపర్ ఫిగర్ రా, కత్తిలా ఉంటుంది, భలే ఎంజాయ్ చేశా, క్వాటర్ బాటిల్ తో రెండు !friends: మీ అమ్మ సూపర్ ఫిగర్ రా, కత్తిలా ఉంటుంది, భలే ఎంజాయ్ చేశా, క్వాటర్ బాటిల్ తో రెండు !

 రాగిణి జీవితంలో బ్లాక్ డే

రాగిణి జీవితంలో బ్లాక్ డే

బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో బహుబాష నటి, స్యాండిల్ వుడ్ హనీ బేబి రాగిణిని గత ఏడాది సెప్టెంబర్ 4వ తేదీన బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నగర శివార్లలోని యలహంకలోని రాగిణి ఇంటిలో సోదాలు చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమె మొబైల్ ఫోన్ లు సీజ్ చేశారు. రాగిణి బెడ్ రూమ్ లో పోలీసులు గంజాయితో నింపిన సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ రోజు నుంచి రాగిణి ద్వివేదిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అనేకసార్లు విచారణ చేశారు.

 షాక్ ఇచ్చిన క్రైమ్ బ్రాంచ్

షాక్ ఇచ్చిన క్రైమ్ బ్రాంచ్

డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను అమాయకురాలు, తనకు బెయిల్ మంజూరు చెయ్యాలి అంటూ రాగిణి ఆమె తరపు న్యాయవాదులతో బెంగళూరులోని ఎన్ డీపీఎస్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. నటి రాగిణికి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని, ఆమె డ్రగ్స్ సేవించినట్లు మా దగ్గర సాక్షాలు ఉన్నాయని, ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని, ఆమెకు బెయిల్ మంజూరు చెయ్యకూడదని బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (CCB) కోర్టులో మనవి చేశారు.

 నాకేం తెలీదు..... పొరపాటు జరిగింది

నాకేం తెలీదు..... పొరపాటు జరిగింది

తనకు ఏపాపం తెలీదని, ఈ డ్రగ్స్ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని, నాకు బెయిల్ ఇవ్వండి అంటూ రాగిణి కోర్టును ఆశ్రయించింది. అయితే రాగిణికి డ్రగ్స్ కేసుతో పక్కా సంబంధం ఉందని, బెయిల్ ఇవ్వకూడదని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బెంగళూరు ప్రత్యేక కోర్టుకు మనవి చేశారు. రాగిణికి బెయిల్ ఇవ్వడానికి ప్రత్యేక కోర్టులు, కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. అప్పటి నుంచి రాగిణ ద్వివేది బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకే పరిమితం అయ్యింది.

 సంజనా మేడమ్ అండ్ కో సేఫ్

సంజనా మేడమ్ అండ్ కో సేఫ్

బెంగళూరు డ్రగ్స్ కేసులో స్యాండిల్ వుడ్ హీరోయిన్ రాగిణితో పాటు బహుబాష నటి సంజనా కూడా అరెస్టు అయ్యింది. నటి రాగిణికి బెయిల్ ఇవ్వడానికి ప్రత్యేక కోర్టు నిరాకరించడంతో ఆమె కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. రాగిణితో పాటు సంజనా, ఇదే కేసులో అరెస్టు అయిన కొందరు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్యం కారణంతో నటి సంజనా గల్రానీ బెయిల్ తీసుకుని ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చింది. ఇదే కేసులో డ్రగ్స్ కేసు కింగ్ పిన్ వీరన్ ఖన్నాకు బెయిల్ మంజూరు అయ్యింది. వేరే కేసులో బెయిల్ రాకపోవడంతో వీరేన్ ఖాన్నా ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఇదే డ్రగ్స్ కేసులో శివప్రకాష్ కూడా జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడు.

 హైకోర్టు తీర్పుతో పోరాటం

హైకోర్టు తీర్పుతో పోరాటం

బెంగళూరు సీసీబీ పోలీసుల విచారణ పూర్తి అయ్యిందని, రాగిణి అనారోగ్యంతో బాధపడుతోందని, కర్ణాటక హైకోర్టు తీర్పును రద్దు చెయ్యాలని, ఆమెకు బెయిల్ మంజూరు చెయ్యాలని, పోలీసుల విచారణకు రాగిణి పూర్తిగా సహకరిస్తుందని ఆమె న్యాయవాది సిద్దార్థ లూత్రా సుప్రీం కోర్టుకు మనవి చేశారు.సుప్రీం కోర్టులో అనేకసార్లు వాదనలు జరిగాయి. చివరికి నటి రాగిణికి సుప్రీం కోర్టు షరతులతో బెయిల్ మంజూరు అయ్యింది.

 పగవాళ్లకు ఈ కష్టాలు వద్దు స్వామి

పగవాళ్లకు ఈ కష్టాలు వద్దు స్వామి

బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న నటి రాగిణిని జైలు నుంచి బయటకు తీసుకురావడానికి ఆమె కుటుంబ సభ్యులు పరుగు తీశారు. పగవాళ్లకు కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు స్వామి అంటూ నటి రాగిణితో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు అంటున్నారు. మొత్తం మీద 140 రోజుల పాటు సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవించిన నటి రాగిణి జైలు నుంచి బయటకు వస్తుండటంతో ఆమె అభిమానులు కొంచెం ఊపిరిపీల్చుకుంటున్నారు.

English summary
Sandalwood Drug Case: Actress Ragini Dwivedi Gets Bail after 140 Days in Jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X