హత్యకేసులో షాకింగ్ ట్విస్ట్: శాండిల్‌వుడ్ సూపర్ స్టార్ అరెస్ట్: ఫామ్ హౌస్‌లో..

Challenging Star Darshan: ప్రముఖ కన్నడ హీరో, శాండిల్‌వుడ్ సూపర్ స్టార్ దర్శన్ తూగుదీప అరెస్ట్ అయ్యారు. ఈ తెల్లవారు జామున మైసూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ హత్య కేసులో ఆయనను నిందితుడిగా గుర్తించారు. దర్శన్‌తో పాటు మరో 10 మంది అరెస్ట్ అయ్యారు.

చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్‌ను ప్రధాన నిందితుడిగా అనుమానిస్తోన్నారు పోలీసులు. గతంలో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ హత్య కేసుపై కొద్దిరోజులుగా మైసూరు పోలీసులు దర్యాప్తు సాగిస్తోన్నారు. ఎట్టకేలకు దీన్ని ఛేదించినట్టయింది.

Sandalwood super star Darshan have been arrested

కన్నడ నటి పవిత్ర గౌడపై సోషల్ మీడియాలో అసభ్యకర, అశ్లీలకరమైన పోస్టులు, కామెంట్స్ చేస్తుండేవాడనే ఆరోపణలు రేణుకా స్వామిపై ఉండేవి. దర్శన్‌తో పవిత్ర గౌడకు అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ పోస్టులు పెట్టాడనేది ఆయనపై ఉన్న విమర్శలు. చిత్రదుర్గలో ఓ మెడికల్ షాప్‌లో పని చేసే రేణుకాచార్య కొద్ది రోజుల కిందట కిడ్నాప్‌కు గురయ్యాడు.

దీనిపై చిత్రదుర్గలో మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. అతని కోసం పోలీసులు గాలిస్తోండగానే.. మైసూరులో మృతదేహమై కనిపించాడు. మొదట ఆత్మహత్యగా భావించారు పోలీసులు. శరీరంపై గాయాలు కనిపించడం, పోస్ట్ మార్టమ్ రిపోర్ట్‌లో అసహజ మరణంగా తేలడంతో హత్యగా కేసు ఫైల్ చేశారు. దర్యాప్తు ముమ్మరం చేశారు.

తీగ లాగితే- దర్శన్ డొంక కదిలినట్టయింది. పవిత్ర గౌడపై అసభ్యకరమైన పోస్టులు వేస్తోండటంతో రేణుకాస్వామిపై కక్ష పెంచుకుని దర్శన్ సుపారీ ఇచ్చి అతణ్ని హత్య చేయించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ అనుమానాలతోనే ఆయనను మైసూరు పోలీసులు ఫామ్ హౌస్‌లో అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+