hyderabad drugs deal emi case telugu actor sudeep producer tears bengaluru police హైదరాబాద్ స్యాండిల్ వుడ్ డ్రగ్స్ డీల్ కేసు తెలుగు హీరో సుదీప్ నిర్మాత కన్నీళ్లు బెంగళూరు పోలీసులు
Hero: సార్.... నాకు EMIకే దిక్కులేదు, డ్రగ్స్ పార్టీలా ?, టాప్ హీరో చేస్తాన్నాడు, తెలుగు హీరో, అయ్యో
హైదరాబాద్/ బెంగళూరు: బెంగళూరు డ్రగ్స్ కేసులో తెలుగు హీరోకు సినిమా కష్టాలు ఎదురైనాయి. ప్రముఖ నిర్మాత అరెస్టు కావడంతో ఆ తెలుగు హీరో పేరు తెరమీదకు రావడం కలకలం రేపింది. పోలీసుల విచారణలో ఆ తెలుగు హీరో నిజంగానే తనకు సినిమా కష్టాలు ఉన్నాయని, టాప్ హీరోలు లాగా తాను జీవితం ఎంజాయ్ చెయ్యడం లేదని వాపోయాడు. సార్ నాకు EMI కట్టడానికి డబ్బులు లేవు, ఇక డ్రగ్స్ పార్టీలు, పబ్ లు, మందు పార్టీలకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి, నా పరిస్థితి మీరే అర్థం చేసుకోండి అంటూ బోరన విలపించాడని చెప్పడంతో పోలీసు అధికారులు షాక్ అయ్యారు.
Illegal affair: భర్త ఫ్రెండ్ తో బెడ్ రూమ్ లో భార్య బిజీ, కొడుకు చూశాడని ?, కన్న తల్లేనా ?

నిర్మాత దెబ్బతో హడల్
బెంగళూరు డ్రగ్స్ కేసులో స్యాండిల్ వుడ్ ప్రముఖ నిర్మాత శంకర్ గౌడను బెంగళూరులోని గోవిందపురం పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈగ ఫేమ్ సుదీప్ హీరోగా నటించి ఆయన దర్శకత్వం వహించిన సింగం రీమేక్ సినిమా కెంపేగౌడ సినిమాకు శంకర్ గౌడ నిర్మాత. కెంపేగౌడ సినిమాలో సుదీప్ హీరోగా, హీరోయిన్ గా రాగిణి ద్వివేది నటించింది.

శంకర్ దెబ్బతో తనీష్ కు తడిసిపోయింది
పోలీసుల విచారణలో సినీ నిర్మాత శంకర్ గౌడ కొంతమంది పేర్లు బయటపెట్టాడు. హైఫై పార్టీలు ఏర్పాటు చేసి అక్కడ ప్రముఖులకు శంకర్ గౌడ డ్రగ్స్ సరఫరా చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో శంకర్ గౌడ ఇచ్చిన సమాచారంతో ప్రముఖ తెలుగు నటుడు, హీరో తనీష్ అల్లాడికి బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చెయ్యడంతో తనీష్ కు తడిసిపోయింది.

సార్.... నేను అలాంటి వాడు కాదు
బెంగళూరు పోలీసుల ముందు తెలుగు హీరో తనీష్ అల్లాడి విచారణకు హాజరైనాడు. పోలీసుల ముందు కన్నీళ్లు పెట్టుకుని తనీష్ అతని గోడు వినిపించాడని కన్నడ మీడియా అంటోంది. సార్ అందరి హీరోలులాగా తాను లగ్జరీ లైఫ్ గడపడం లేదని, తనకు అనేక కష్టాలు ఉన్నాయని హీరో తనీష్ బోరున విలపించాడని తెలిసింది.

EMIకే దిక్కులేదు... డ్రగ్స్ పార్టీలా ?
తాను సాదాసీదా జీవితం గడుపుతున్నానని, నేను చేసిన అప్పులకు EMI లు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ఇక నా ముఖానికి డ్రగ్స్ పార్టీలు, పబ్ లు, మందు పార్టీలకు డబ్బులు ఎవరు ఇస్తారని తనీష్ విలపించాడని కన్నడ మీడియా అంటోంది. తనకు డ్రగ్స్ కేసుతో, డ్రగ్స్ డీలర్స్ తో ఎలాంటి సంబంధాలు లేవని హీరో తనీష్ బెంగళూరు పోలీసులకు చెప్పాడు.

టాప్ హీరో చేస్తానంటే నమ్మి వచ్చాను
ఈగ ఫేమ్ సుదీప్ కన్నడలో పెద్ద హీరో అనే విషయం తెలిసిందే. సుదీప్ అంతటి హీరోను చేస్తానని, నువ్వు నాతో టచ్ లో ఉండాలని నిర్మాత శంకర్ గౌడ తనకు చెప్పాడని, హీరోగా చాన్స్ లు వస్తాయని ఆశతోనే తాను నిత్యం బెంగళూరు వచ్చి ఆయన్ను కలుస్తున్నానని, అంతకు మించి ఆయనతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని తెలుగు హీరో తనీష్ బెంగళూరు పోలీసుల ముందు బోరున విలపించాడని కన్నడ మీడియా కోడైకూస్తోంది.