Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్టార్ హీరో భార్య ఆస్తుల విలువ ఎంతంటే ?, ఎన్ని కేజీల బంగారు, కూతురి బ్యాంక్ బ్యాలెన్స్, ఎన్ని కార్లు !

స్యాండిల్ వుడ్ నటుడు, హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ భార్య గీతా శివరాజ్‌కుమార్ కర్ణాటకలోని శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సోమవారం నామినేషన్ దాఖలు చేసిన గీతా శివరాజ్ కుమార్ ఆమె మొత్తం ఆస్తులను ప్రకటించారు. స్యాండిల్ వుడ్ లో స్టార్ హీరో అయిన శివరాజ్ కుమార్ భార్య, మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమార్తె గీతా శివరాజ్ కుమార్ ఆస్తుల విలువ ఎంత అనే విషయం హాట్ టాపిక్ అయ్యింది.

గీతా శివరాజ్‌కుమార్ కుటుంబం మొత్తం ఆస్తులు ఎంత, అఫిడవిట్‌లో ఏముంది? అనే సమాచారాన్ని తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. శివమొగ్గ లోక్ సభ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గీతా శివరాజ్ కుమార్ పోటీ చేస్తున్నారు. తన భర్త శివరాజ్ కుమార్ తో కలిసి గీతా శివరాజ్ కుమార్ నామినేషన్ వేశారు. తనకు రూ. 89. 31 కోట్ల ఆస్తులు ఉన్నాయని గీతా శివరాజ్ కుమార్ ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

బంగారు ఆభరణాల విలువ, వాటి వివరాల ప్రకారం గీతా శివరాజ్‌కుమార్ దగ్గర 11,542 గ్రాముల వజ్రాలు, బంగారు ఆభరణాలు ఉన్నాయి, వాటి విలువ రూ.3.50 కోట్లు అని గీతా శివరాజ్ కుమార్ అఫిడవిట్‌లో వెల్లడించారు. గీతా శివరాజ్ కుమార్ మొత్తం ఆస్తుల విలువ రూ.40.04 కోట్లు. గీతా శివరాజ్ కుమార్ భర్త శివ రాజ్‌కుమార్ ఆస్తుల విలువ రూ. 49 కోట్ల రూపాయలు అని అఫిడవిట్ లో పేర్కొన్నారు.

Sandwood Hero Shivraj Kumar Wife Geeta Shivraj Kumar Net Worth

గీతా శివరాజ్ కుమార్తె బ్యాంక్ బ్యాలెన్స్ రూ.100 మాత్రమే ఉందని హీరో దంపతులు అఫిడవిట్ లో సమర్పించారు. శివన్న, గీతా శివరాజ్ కుమార్ దంపతుల కుమార్తె నివేదిత బ్యాంకు బ్యాలెన్స్‌ కేవలం 100 రూపాయలు మాత్రమే ఉంది. అయితే తన సొంత నిర్మాణ సంస్థ శ్రీ ముత్తు సినీ సర్వీసెస్‌కు రూ.లక్ష రుణం అందించారు. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరంలో గీతా వార్షిక ఆదాయం రూ.1. 48 కోట్లు అని ప్రకటించారు.

గీతా-శివన్న వార్షిక ఆదాయ సమాచారం కూడా ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్ లో ఉంది. గీతా శివరాజ్ కుమార్ 2018-22 నుండి వార్షిక ఆదాయం రూ.29 లక్షల నుండి రూ.33 .93 లక్షల వరకు పెరిగింది. అదే వార్షిక ఆదాయం 2022-23లో రూ.1.48 కోట్లకు పెరిగింది. గీతా శివరాజ్ కుమార్ భర్త శివరాజ్ కుమార్ 2022-23లో ఏటా రూ.2.97 కోట్లు ఆదాయం పొందారు.

శివరాజ్ కుమార్ కు 2018-19లో రూ.2. 20 కోట్లు, 2019-20లో రూ.1.87 కోట్లు ఆదాయం వచ్చిందని అఫిడవిట్ లో వివరాలు సమర్పించారు. 2020-21లో వార్షిక ఆదాయం రూ.97.98 లక్షలు, 2021-22లో రూ.1.27 కోట్లు వచ్చిందని నామినేషన్ పత్రంలో పేర్కొన్నారు. గీతా శివరాజ్ కుమార్ వద్ద 3 లక్షలు, శివన్న వద్ద 22.58 లక్షల రూపాయల నగదు ఉన్నట్లు ఎన్నికల అధికారులకు సమాచారం అందించారు.

హీరో శివరాజ్ కుమార్, గీతా శివరాజ్ కుమార్ దగ్గర ఉన్న కార్లు, వాటి వివరాలను ఎన్నికల అధికారులకు తెలిపారు. గీతా శివరాజ్ కుమార్ దగ్గర రూ.1.07 కోట్ల విలువైన టయోటా హైబ్రిడ్ కారు, గీతా శివరాజ్ కుమార్ భర్త శివ రాజ్‌కుమార్‌ దగ్గర టయోటా ఫార్చూనర్ కారు, మారుతీ ఎర్టిగా, వోల్వో ఎస్90 కార్లు ఉన్నాయి. శివరాజ్ కుమార్, గీతా శివరాజ్ కుమార్ దంపతుల పేరిట కనకపుర తాలూకా చకనహళ్లిలో 11 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని ఎన్నికల అధికారులకు అఫిడవిట్ సమర్పించారు.

Sandwood Hero Shivraj Kumar Wife Geeta Shivraj Kumar Net Worth

హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్ భారీ రోడ్ షో ద్వారా నామినేషన్ పత్రాలు సమర్పించారు. సోమవారం శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని గీతా శివరాజ్ కుమార్ దాఖలు చేశారు. ఈ సమయంలో భారీ ఊరేగింపు జరిగింది. హీరో శివరాజ్ కుమార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక నాయకులు, వేలాది మంది కార్యకర్తలు, శివరాజ్ కుమార్ అభిమానులు వేలాది మంది పాల్గొన్నారు.

మద్దతుదారులతో కలిసి ర్యాలీగా వెళ్లిన గీతా శివరాజ్ కుమార్ ఎన్నికల అధికారులకు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. గీతా శివరాజ్ కుమార్ వెంట ఆమె భర్త శివరాజ్‌కుమార్‌, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, గీతా సోదరుడు, శివమొగ్గ జిల్లా ఇన్‌చార్జి మంత్రి మధు బంగారప్ప, మాజీ విద్యాశాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్‌ సహా కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు. శివమొగ్గ లోక్ సభ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గీతా శివరాజ్ కుమార్ నుంచి ఎన్నికల అధికారి గురుదత్త హెగ్డే నామినేషన్ పత్రాన్ని స్వీకరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+