‘అజిత్ ప్రతీ అడుగు అనుమానమే.. బాడీలాంగ్వేజ్‌లో తేడా, ఫోన్ స్విచ్ఛాఫ్, వెన్నుపోటే’

బీజేపీతో జతకట్టి డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన అజిత్ పవార్‌పై శివసేన మండిపడుతున్నది. రాత్రి వరకు చర్చలు జరిపి తెల్లవారే సరికి అధికారం కోసం ఫిరాయింపుకు పాల్పడిన అజిత్‌పై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా పరిణామంపై సంజయ్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రజలకు నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ వెన్నుపోటు పొడిచారు అని అన్నారు. శనివారం ఉదయం 5.47 నిమిషాలకు మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణం చేయడం మరాఠా రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

అజిత్ వ్యవహారం అనుమానమే

అజిత్ వ్యవహారం అనుమానమే

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు అనంతరం సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. నిన్నటి వరకు మాతో అజిత్ పవార్ చర్చల్లో ఉన్నారు. ఆ చర్చల్లో మాతో ఉన్నప్పటికీ.. మాతో కళ్లలోకి చూసి మాట్లాడే ప్రయత్నం చేయలేకపోతుండటంతో మాకు అనుమానం వచ్చింది. చర్చలు జరుగుతుండగానే మధ్యలో వెళ్లిపోయాడు. లాయర్‌తో అపాయింట్‌మెంట్ ఉందని వెళ్లడంతోనే మాకు అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.

బాడీ లాంగ్వేజ్‌లో తేడా

బాడీ లాంగ్వేజ్‌లో తేడా

శుక్రవారం మా మధ్య చర్చ జరుగుతుండగానే అజిత్ పవార్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. అప్పుడే ఆయన బాడీ లాంగ్వేజ్‌లో తేడా కనిపించింది. కానీ ఆయన ఏ లాయర్ వద్దకు వెళ్లాడో నాకు కానీ ఇలా వెన్నుపోటుకు పాల్పడతారని ఊహించలేదు. మహారాష్ట్ర ప్రజల వీపులో వెన్నుపోటు పొడిచాడు అని సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఈ వ్యవహారంలో శరద్ పవార్‌కు ప్రమేయం ఉంటుందని అనుకోవడం లేదన్నారు.

శరద్ పవార్‌కు మోసం

శరద్ పవార్‌కు మోసం

అధికారం కోసం ఏకంగా శరద్ పవార్‌నే మోసగించాడు. ఈ నేపథ్యంలో పవార్‌కు మద్దతుగా నిలుస్తాం. మొదటి నుంచి అజిత్ వ్యవహారం అనుమానంగా ఉంది. తాజా పరిణామాలతో శరద్‌కు ఎలాంటి సంబంధం లేదు. కాగా, ఈ ఘటనపై శరద్ పవార్ స్పందిస్తూ.. బీజేపీకి మద్దతు ఇవ్వడం అజిత్ పవార్ వ్యక్తిగత విషయం అని అన్నారు. ఎన్సీపీని చీల్చి అజిత్ బీజేపీకి మద్దతు ఇవ్వడంపై రాజకీయ వర్గాలు నివ్వెరపాటుకు గురవుతున్నాయి.

శివసేనపై బీజేపీ ఫైర్

శివసేనపై బీజేపీ ఫైర్

శివసేన, కాంగ్రెస్ నేతల విమర్శలపై బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్ స్పందించారు. శివసేన పార్టీనే బీజేపీకి వెన్నుపోటు పొడిచింది. సీఎం పదవిపై ఎలాంటి ఒప్పందం లేకుండా మేము ఎన్నికల్లో పోటీ చేశాం. కానీ ఫలితాల తర్వాత శివసేన మాట మార్చింది అని అని పాటిల్ అన్నారు. రొటేషన్ పద్దతిలో సీఎం పదవి పంచుకొందామనే ప్రతిపాదనను తిరస్కరించిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+